Jump to content

బాలసంతు

వికీపీడియా నుండి
బాల సంతు వారు వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపు లోని 2వ కులం. బాలసంతు వారు శైవులు. తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు. కొన్నిచోట్ల వీరిని బహురూపులనికూడా అంటారు. తెల్లవారుఝామున గంట వాయిస్తూ బిక్షాటన చేసి జీవితం గడిపేవారు బలసంతు. శవాల దగ్గర గంట వాయించి కూడా డబ్బులు వసూలు చేస్తారు. పాతతరంవారు, కొన్ని కట్టుబాట్లకు కట్టుబడినవారే నేడు బాలసంతుగా కనిపిస్తున్నారు. బిక్షాటన వీరి వృత్తి. దీని ద్వారా వచ్చే ఆదాయం తక్కువ కనుక వీరు చిన్నాచితకా జంతువులను వేటాడి జీవిస్తుంటారు. ఈ కారణంగానే బాలసంతులు ఎక్కడికి వెళ్లినా ఊరికి దూరంగా జీవిస్తారు. వీరిజీవితంలో వేట ఒక భాగం కావటంతో కుక్కలు, వలలు, బోనులు, వేటకొడవళ్లు వెంట ఉంటాయి. వీరు ఎక్కడ ఉన్నా సొంత భాషలోనే మాట్లాడుకుంటారు. బాలసంతు మహిళలు ఈత చాపలు అల్లి కుటుంబ పోషణకు సహకరిస్తారు. ఇదిలా ఉంటే చట్టపరంగా వేట నిషేధం కావటం, ధర్మం వేసేవారు సైతం కరువవ్వటంతో వీరు పట్టణాలకు వలసపట్టారు. పట్టణాలకు చేరిన బాలసంతు మహిళలు సైతం వంటపాత్రలు, స్లాస్టిక్‌ సామానులు అమ్మటం వంటి చిరువ్యాపారాలు చేస్తున్నారు. వీరిలో చదువుకున్నవారి సంఖ్య బహు అరుదు.ఎస్సీలలో ఉన్న బుడగజంగాలు కథలు చెపితే, వీరు గంట పట్టుకుని బిక్షాటన చేస్తారు. ఈ రెండు కులాల మధ్య ఈ ఒక్క తేడా మినహా మిగతా ఆచార వ్యవహారాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇంటిపేర్లు కూడా ఒకటే. కనుక బుడగజంగాలు , బాలసంతులు శతాబ్దాలుగా ఒకే విధమైన జీవితం గడుపుతున్నారు. అయినప్పటికీ ఎస్సీ జాబితాలో చేరిన బుడగజంగాలు బాలసంతులకన్నా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న కారణంగా తామూ బుడగజంగాలమని చెప్పుకోవటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కులాలకు తేడా తెలిపే గంటను చేతపట్టే విధానానికి వీరు స్వస్తిపలికారు. కనుక వీరూ ఎస్సీలుగా చెలామణి అవుతున్నారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాలసంతు&oldid=4348616" నుండి వెలికితీశారు