బాలాసాహెబ్ విఖే పాటిల్
స్వరూపం
బాలాసాహెబ్ విఖే పాటిల్ | |||
| |||
కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి
| |||
పదవీ కాలం 13 అక్టోబర్ 1999 – 1 జూలై 2002 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
---|---|---|---|
ముందు | సురేష్ ప్రభు | ||
తరువాత | సుబోధ్ మోహితే | ||
ఆర్థిక శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 13 అక్టోబర్ 1999 – 1 జూలై 2002 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
ముందు | వి.ధనంజయ్ కుమార్ | ||
తరువాత | అనంత్ గీతే | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | ప్రసాద్ తాన్పురే | ||
తరువాత | నియోజకవర్గం రద్దు | ||
నియోజకవర్గం | కోపర్‌గావ్ | ||
పదవీ కాలం 1998 – 1999 | |||
ముందు | మారుతి దేవరామ్ షెల్కే | ||
తరువాత | దిలీప్ కుమార్ గాంధీ | ||
నియోజకవర్గం | అహ్మద్‌నగర్ | ||
పదవీ కాలం 1971 – 1991 | |||
ముందు | అన్నాసాహెబ్ షిండే | ||
తరువాత | శంకర్రావు కాలే | ||
నియోజకవర్గం | కోపర్‌గావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అహ్మద్‌నగర్, మహారాష్ట్ర | 1932 ఏప్రిల్ 10||
మరణం | 2016 డిసెంబరు 30 లోని, ప్రవరనగర్, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర | (వయసు 84)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
జీవిత భాగస్వామి | సింధుతాయ్ | ||
సంతానం | అశోక్ విఖే పాటిల్, రాధాకృష్ణ విఖే పాటిల్ & రాజేంద్ర విఖే పాటిల్ సహా 5 | ||
నివాసం | అహ్మద్‌నగర్ |
ఏకనాథరావు అలియాస్ బాలాసాహెబ్ విఖే పాటిల్ (10 ఏప్రిల్ 1932 - 30 డిసెంబర్ 2016) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ & ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]
బాలాసాహెబ్ విఖే పాటిల్ 14వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా పని చేశాడు. ఆయన మహారాష్ట్రలోని లోనిలో ఆసియాలో మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ పెద్ద కుమారుడు.
ఇతర పదవులు
[మార్చు]- ప్రవర సహకార చక్కెర కర్మాగారానికి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పని చేశాడు
- 1980 నుండి అతను ఇండో-సోవియట్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. *1981 నుంచి 1984 వరకు రాష్ట్ర చక్కెర సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
- ప్రవర గ్రామీణ విద్యాసంస్థకు 25 ఏళ్లపాటు అధ్యక్షుడిగా ఉన్నారు.
- ఆయన లోక్‌సభ పిటిషన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు.
అవార్డులు
[మార్చు]- 2007లో విద్య, గ్రామీణాభివృద్ధి రంగంలో జీవితకాల సాధనకు పూణే విశ్వవిద్యాలయం నుండి జీవన్ సాధన గౌరవ్ అవార్డు
- ఆయన సోషల్ వర్క్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ 31 మార్చి 2010న భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం.[2]
- D.Sc - 2013 సంవత్సరంలో మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్ , రాహురి ద్వారా డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును ప్రదానం చేసింది.
మరణం
[మార్చు]బాలాసాహెబ్ విఖే పాటిల్ 84 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో బాధపడుతూ అహ్మద్‌నగర్‌లోని తన నివాసంలో మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (31 December 2016). "Veteran Congress leader Balasaheb Vikhe-Patil passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ Former Union Minister Balasaheb Vikhe Patil got Padma Bhushan for social work Archived 5 జూన్ 2011 at the Wayback Machine
- ↑ "Congress leader Balasaheb Vikhe Patil dead". 30 December 2016. Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.