బాలాసాహెబ్ సనప్
బాలాసాహెబ్ మహదు సనప్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
ముందు | ఉత్తమ్‌రావ్ ధికాలే | ||
---|---|---|---|
తరువాత | రాహుల్ ధికాలే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బాలాసాహెబ్ మహదు సనప్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాసిక్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బాలాసాహెబ్ సనప్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ నుండి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్, మొదటి వైస్-మేయర్‌గా పని చేశాడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాసిక్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
బాలాసాహెబ్ సనప్ ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాసిక్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాహుల్ ధికాలే చేతిలో 12000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Balasaheb Mahadu Sanap of BJP WINS the Nashik east constituency Maharastra Assembly Election 2014". newsreporter.in. Retrieved 16 April 2016.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Nashik East Constituency Election Results 2024: Nashik East Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). 23 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.