బాలేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలేరు
గ్రామం
బాలేరు is located in Andhra Pradesh
బాలేరు
బాలేరు
Location in Andhra Pradesh, India
నిర్దేశాంకాలు: 18°51′03″N 83°37′47″E / 18.8508001°N 83.6296652°E / 18.8508001; 83.6296652Coordinates: 18°51′03″N 83°37′47″E / 18.8508001°N 83.6296652°E / 18.8508001; 83.6296652
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
532 455
వాహన నమోదు కోడ్AP

బాలేరు (ఆంగ్లం: Baleru), పార్వతీపురం మన్యం జిల్లా, భామిని మండలానికి చెందిన గ్రామం.[1] ఇది వంశధాన నదికి, తివ్వ కొండలకు మధ్య ఉంది.

బాలేరు గ్రామ పంచాయితీలో గల గ్రామాలు బాలేరు, సొలికిరి, నల్లరాయి గూడ, సన్నాయి గూడ, యిసుక గూడ, రేగిడి, లక్ష్మిపురం గ్రామాలున్నాయి.

సర్పంచ్ లు[మార్చు]

బాలేరు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా పనిచేసినవారు: మేడిబోయిన.జగధీశ్వర రావు (1988-1995) తాడేల.తవుడు (1995-2000), దామోదర.సరస్వతి (2000-2005), లక్ష్మి (2005 నుంచి ఇప్పటి వరకు2009) తమ సేవలను బాలేరు గ్రామ పంచాయితీ ప్రజలకు చేసారు. మేడిబోయిన జగధీశ్వర రావు సర్పంచ్‌గా చెయ్యకు మునుపు పడాల.వెంకట రావు, పడాల రాంబాయి,పడాల కొండయ్య (2014-2019) గ్రామ పంచాయితి సర్పంచ్ లు గా పనిచేసారు.

పంటలు[మార్చు]

వరి, పొగాకు, ప్రత్తి, మిర్చి, శనగ, మినుము పండించే ముఖ్యమైన పంటలు.

సంస్కృతి[మార్చు]

దేవాలయం సంక్రాంతి, దీపావళి, వినాయక చవతి, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ముఖ్యంగా జరుపుకునే పండుగలు. ప్రతి సంవత్సరం వూరి నడిబొడ్డున వున్న రామాలయంలో "హరే రామ" మంత్ర సప్తాహం జరుగును. రైతులు ప్రతి వేసవిలో వ్యవసాయం ప్రారంభించే ముందు చెవిటమ్మ తల్లి పూజలు చేసెదరు, కొలుపులు కూడా జరిపించెదరు. శ్రీ స్వామి దేవాలయం ఈ వూరి ప్రత్యేకత. సంక్రాంతి పండుగ నాడు జరుపుకునే తెప్పోత్సవం కన్నుల పండుగగా వుంటుంది. కృష్ణాష్టమి రోజున వుట్టి కొట్టే పోటీలు జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. "Gram Panchayat Identification Codes" (PDF). Saakshar Bharat Mission. National Informatics Centre. p. 431. Archived from the original (PDF) on 18 ఆగస్టు 2017. Retrieved 15 ఆగస్టు 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=బాలేరు&oldid=3639994" నుండి వెలికితీశారు