బాల్ దానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాల్ దానీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హేమచంద్ర తుకారామ్ దానీ
పుట్టిన తేదీ(1933-05-24)1933 మే 24
దుదనీ, మహారాష్ట్ర
మరణించిన తేదీ1999 డిసెంబరు 19(1999-12-19) (వయసు 66)
Nashik, Maharashtra, India
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం, ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 65)1952 నవంబరు 13 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 116
చేసిన పరుగులు - 6,476
బ్యాటింగు సగటు - 44.35
100లు/50లు - 17/34
అత్యధిక స్కోరు - 170*
వేసిన బంతులు 60 12,183
వికెట్లు 1 200
బౌలింగు సగటు 19.00 21.90
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - 0
అత్యుత్తమ బౌలింగు 1/9 7/50
క్యాచ్‌లు/స్టంపింగులు 1 79/0
మూలం: Cricinfo

హేమచంద్ర తుకారాం "బాల్" డాని (1933 మే 24 - 1999 డిసెంబర్ 19) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.

బాల్ దానీ ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. అతను మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు. తర్వాత ఆఫ్, లెగ్ బ్రేక్‌లు కూడా వేసాడు. అతని ఏకైక టెస్ట్ మ్యాచ్ 1952/53లో పాకిస్థాన్‌తో ఆడాడు. భారత్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఆ గేమ్‌ను గెలుచుకుంది. దానీకి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. అతని 10 ఓవర్లలో ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆ సమయంలో అతని వయసు 19 ఏళ్లు కాగా, అతని ఓపెనింగ్ భాగస్వామి లాలా అమర్‌నాథ్‌కు 41 ఏళ్ళు. 1954/55లో కూడా దానీ పాకిస్తాన్‌లో పర్యటించాడు గానీ టెస్టు మ్యాచ్‌లేమీ ఆడలేదు.

దానీ, నాసిక్‌లోని రుంగ్తా హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. సమకాలీన క్రికెటర్ బాపు నాదకర్ణి కూడా ఇదే పాఠశాలలో చదివాడు. అతను BA (ఆనర్స్) డిగ్రీ చేసాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ మహారాష్ట్రలో మొదలైంది. అయితే అతను 1956లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన తర్వాత సర్వీసెస్‌కి మారాడు. ఎయిర్ కమోడోర్‌గా ఎదిగి 1987లో పదవీ విరమణ చేశారు.


దానీ, కెరీర్‌లో 17 సెంచరీలు చేసి, 200 వికెట్లు పడగొట్టాడు. అతను చాలా సంవత్సరాలు సర్వీసెస్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. తన టెస్ట్ కెరీర్ ముగిసిన తర్వాతనే చాలా మంచి క్రికెట్ ఆడాడు. పదవీ విరమణ చేసిన తర్వాత, 1968 నుండి 1975 వరకు జాతీయ సెలెక్టర్‌గా ఉన్నాడు. అతను 1989 - 1997 మధ్య మహారాష్ట్ర రంజీ ట్రోఫీ జట్టుకు మేనేజరు, సెలెక్టరు, కోచ్‌గా పనిచేసాడు. అతను పూణేలోని స్నేహ సేవా అనే స్వచ్ఛంద సంస్థలో పాల్గొన్నాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాల్_దానీ&oldid=3961622" నుండి వెలికితీశారు