బిపిన్ రావత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిపిన్ రావత్
బిపిన్ రావత్

బిపిన్ రావత్


1వ భారత త్రివిధ దళాల దళాధిపతి
పదవీ కాలం
2020 జనవరి 1 (2020-01-01) – 8 డిసెంబరు 2021 (2021-12-08)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నూతనంగా ఏర్పాటు చేశారు
తరువాత అనిల్ చౌహాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-03-16)1958 మార్చి 16
ఉత్తరాఖండ్‌, పౌరీ జిల్లా ,భారతదేశం
మరణం 2021 డిసెంబరు 8(2021-12-08) (వయసు 63)
కూనూర్, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయులు
జీవిత భాగస్వామి మధులిక రావత్‌[1]
సంతానం కృతిక, తారిణి
పురస్కారాలు *పరమ విశిష్ట సేవా పతకం
 • ఉత్తమ యుద్ధ సేవా పతకం
 • ఉత్తమ యుద్ధ సేవా పతకం
 • అతి విశిష్ట సేవా పతకం
 • యుద్ధ సేవా పతకం
 • సేవా పతకం
 • విశిష్ట సేవా పతకాలను

బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ (16 మార్చి 1958 - 8 డిసెంబర్ 2021)భారతీయ సైనిక అధికారి. జనవరి 2020 నుండి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా పనిచేశాడు.[2][3][4][5]ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది[2].[6]

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మ విభూష‌ణ్‌ అవార్డు అందుకున్న బిపిన్‌ రావత్‌ కుమార్తెలు కృతిక, తారిణి


బిపిన్ రావత్ |ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో 16 మార్చి, 1958న జన్మించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో, లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. 1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లోని పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో ఐదవ రెజిమెంట్‌లో చేరారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు.

విద్యాభ్యాసం[మార్చు]

రావత్ డెహ్రాడూన్‌లోని కేంబ్రియన్ హాల్ స్కూల్‌లో, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో చేరారు. రావత్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్‌టన్‌, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్‌, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత కమాండ్ కోర్సులో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2011లో మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ ఆయనకు సైనిక-మీడియా వ్యూహాత్మక అధ్యయనాలపై చేసిన పరిశోధనలకు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని ప్రదానం చేసింది. చెన్నై యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పట్టా పొందారు. మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. అమెరికాలోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో సైనిక కమాండర్లకు ఇచ్చిన శిక్షణా తరగతులు హాజరయ్యారు.[7]

సైన్యాధిపతి హోదాలో[మార్చు]

సైన్యాధిపతి హోదాలో రావత్‌ అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాన్ని తెచ్చారు. సిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్‌ పాఠశాలలో చదివిన రావత్‌ ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత 1978 డిసెంబర్‌లో గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

సైన్యంలో ఎదిగిన తీరు[మార్చు]

 • సెకండ్‌ లెఫ్టినెంట్‌: 1978 డిసెంబర్‌ 16
 • లెఫ్టినెంట్‌: 1980 డిసెంబర్‌ 16
 • కెప్టెన్‌: 1984 జూలై 31
 • మేజర్‌: 1989 డిసెంబర్‌ 16
 • లెఫ్టినెంట్‌ కల్నల్‌: 1998 జూన్‌ 1
 • కల్నల్‌: 2003 ఆగస్టు 1
 • బ్రిగేడియర్‌: 2007 అక్టోబర్‌ 1
 • మేజర్‌ జనరల్‌: 2011 అక్టోబర్‌ 20
 • లెఫ్టినెంట్‌ జనరల్‌: 2014 జూన్‌ 1
 • జనరల్‌(సీఓఏఎస్‌): 2017 జనవరి 1
 • జనరల్‌(సీడీఎస్‌): 2019 డిసెంబర్‌ 31

పురస్కారాలు[మార్చు]

రక్షణశాఖలో రావత్‌ అదించిన సేవలకు గాను.. భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం అతి విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను పొందారు. 2022

సంవత్సరానికి గానూ బిపిన్‌ రావత్‌ కు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.[8]

మరణం[మార్చు]

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ మరణించారు. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు డిసెంబరు 8, 2021న ఉదయం రావత్‌ దంపతులు, ఇతర ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్‌ దంపతులు సహా పదమూడు మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ చికిత్స పొందుతున్నారు.[9]

మూలాలు[మార్చు]

 1. Sakshi (8 December 2021). "భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
 2. 2.0 2.1 Bhaumik, Subir (8 December 2021). "Bipin Rawat: India's 'inspiring commander' who died in helicopter crash". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Kolkata. Retrieved 8 December 2021.
 3. "General Bipin Rawat Appointed as Chief of Defence Staff". 30 December 2019.
 4. "Army chief General Bipin Rawat named India's first Chief of Defence Staff". India Today (in ఇంగ్లీష్). Retrieved 30 December 2019.
 5. "Who is Bipin Rawat: A brief look at General Bipin Rawat, India's first CDS". m-economictimes-com.cdn.ampproject.org. Retrieved 30 December 2019.
 6. Namasthe Telangana (21 March 2022). "కనులపండువలా పద్మ అవార్డుల ప్రదానం.. సీడీఎస్‌ బీపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. ఆజాద్‌కు పద్మభూషణ్‌". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
 7. 10TV (8 December 2021). "భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి.. IAF Helicopter Crashes In Tamil Nadu: Gen Bipin Rawat, Wife Madhulika, 11 Others Dead" (in telugu). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 8. "Padma awards: బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌". EENADU. Retrieved 2022-01-25.
 9. "హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి". BBC News తెలుగు. 2021-12-08. Retrieved 2021-12-10.