బిఫోర్ సన్‌రైజ్ (1995 సినిమా)
బిఫోర్ సన్‌రైజ్ | |
---|---|
దర్శకత్వం | రిచర్డ్ లింక్లేటర్ |
రచన | రిచర్డ్ లింక్లేటర్, కిమ్ క్రజన్ |
నిర్మాత | అన్నే వాకర్-మక్ బే |
తారాగణం | ఎథాన్ హాకీ, జూలీ డిల్పే |
ఛాయాగ్రహణం | లీ డేనియల్ |
కూర్పు | సాంద్ర అడైర్ |
సంగీతం | ఫ్రెడ్ ఫ్రిత్[1] |
నిర్మాణ సంస్థ | కాస్ట్ రాక్ ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్ |
విడుదల తేదీs | జనవరి 19, 1995( సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్) జనవరి 27, 1995 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 101 నిముషాలు[2] |
దేశాలు | యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ |
భాషలు | ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ |
బడ్జెట్ | $2.5 మిలియన్ |
బాక్సాఫీసు | $5.5 మిలియన్ |
బిఫోర్ సన్‌రైజ్ 1995, జనవరి 27న రిచర్డ్ లింక్లేటర్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. అమెరికా యువకుడు, ఫ్రెంచ్ యువతి రైలులో కలుసుకుని, వియన్నాలో ఒక రాత్రి గడిపే కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎథాన్ హాకీ, జూలీ డిల్పే జంటగా నటించారు. కేవలం 11రోజుల్లో ఈ సినిమా స్క్రిప్టును రాశాడు.[3] బిఫోర్ సన్‌రైజ్ సినిమాకు సీక్వెల్ గా బిఫోర్ సన్‌సెట్ (2004), బిఫోర్ మిడ్‌నైట్ (2013) సినిమాలు తీశాడు.
నటవర్గం
[మార్చు]- ఎథాన్ హాకీ
- జూలీ డిల్పే
- ఆండ్రియా ఎకెర్ట్
- హనో పోషల్
- కార్ల్ బ్రుక్స్చ్వివాగర్
- టెక్స్ రుబినోవిట్జ్
- ఎర్ని మంగోల్డ్
- డొమినిక్ కాస్టెల్
- హేమోన్ మరియా బుట్టింగర్
- బిల్లే జెస్చిమ్
- ఆడమ్ గోల్డ్బెర్గ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రిచర్డ్ లింక్లేటర్
- నిర్మాత: అన్నే వాకర్-మక్ బే
- రచన: రిచర్డ్ లింక్లేటర్, కిమ్ క్రజన్
- సంగీతం: ఫ్రెడ్ ఫ్రిత్
- ఛాయాగ్రహణం: లీ డేనియల్
- కూర్పు: సాంద్ర అడైర్
- నిర్మాణ సంస్థ: కాస్ట్ రాక్ ఎంటర్టైన్మెంట్
- పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్
స్ఫూర్తి
[మార్చు]చిత్ర దర్శకుడు రిచర్డ్ లింక్లేటర్ 1989లో ఒకరోజు రైలులో న్యూయార్క్ నుండి ఆస్టిన్ వరకు ప్రయాణించాడు.[4] ఆ సందర్భంలో అతనికి అమీ లెహ్రౌఅప్ అనే యువతి పరిచయం అయింది, ఆమెతో ఫిలడెల్ఫియాలో అతను ఒకరోజు గడిపాడు.[5] ఆ సంఘటనే ఈ సినిమాకు స్ఫూర్తి. బిఫోర్ సన్‌రైజ్ చిత్రం విడుదలకుముందే మోటార్ సైకిల్ ప్రమాదంలో అమీ లెహ్రౌఅప్ మరణించింది. ఈ విషయం రిచర్డ్ లింక్లేటర్ 2010లో తెలిసింది.
విడుదల
[మార్చు]1995, జనవరి 19న సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది.[6] జనవరి 27న యునైటెడ్ స్టేట్స్ లో విడుదలైంది.
అవార్డులు
[మార్చు]- ఈ చిత్రం 45వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోటు సంపాదించుకొని ఉత్తమ దర్శకుడు విభాగంలో సిల్వర్ బేర్ అవార్డును గెలుచుకుంది.[7]
బడ్జెట్
[మార్చు]ఈ చిత్ర నిర్మాణానికి 2.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబడడ్డాయి. మొదట్లో 363 థియేటర్లలో విడుదలై 1.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి, మొత్తంగా 5.5 మిలియన్ డాలర్లను సంపాదించింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Before Sunrise: Production Credits". New York Times. 2010. Archived from the original on 20 జూన్ 2013. Retrieved 22 April 2019.
- ↑ "BEFORE SUNRISE (15)". British Board of Film Classification. March 10, 1995. Retrieved 22 April 2019.
- ↑ Linklater, Richard; Kim Krizan (March 1995). "Before Sunrise". St. Martin's Griffin. pp. V.
- ↑ Wickman, Forrest. "The Real Couple Behind Before Sunrise". Slate. Retrieved 23 April 2019.
- ↑ Youtube profile of Lehrhaupt by Jeff Rowan uploaded 15 Feb 2015
- ↑ Thompson, Ben (May 1995). "The First Kiss Takes So Long". Sight and Sound.
- ↑ "Berlinale: 1995 Prize Winners". Berlinale.de. Archived from the original on 8 ఆగస్టు 2017. Retrieved 23 April 2019.
- ↑ "Before Sunrise". Box Office Mojo. Archived from the original on March 3, 2009. Retrieved 23 April 2019.