Jump to content

బిబ్‌సిస్

వికీపీడియా నుండి

బిబ్‌సిస్ (BIBSYS) అనేది నార్వే ప్రభుత్వ విద్య, పరిశోధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్న ఒక ఏజెన్సీ. అది పరిశోధన, బోధన, అభ్యాసానికి సంబంధించిన డేటా మార్పిడి, నిల్వ, తిరిగి పొందే వీలు కల్పిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే చారిత్రికంగా లైబ్రరీ వనరులకు సంబంధించిన మెటాడేటాను నిర్వహిస్తుంది.

బిబ్‌సిస్ అన్ని నార్వే విశ్వవిద్యాలయాలు, విశ్వవిద్యాలయ కళాశాలలతో పాటు పరిశోధనా సంస్థలు, నేషనల్ లైబ్రరీ ఆఫ్ నార్వేతో కలిసి పనిచేస్తోంది. [1] [2] బిబ్‌సిస్ అధికారికంగా నార్వేలోని ట్రోండ్‌హీమ్‌లో ఉన్న నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NTNU)లో ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసారు. దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నార్వేజియన్ విద్య, పరిశోధన మంత్రిత్వ శాఖ నియమిస్తుంది.

బిబ్‌సిస్ పరిశోధకులకు, విద్యార్థులకు, ఇతరులకు ఏకీకృత శోధన సేవ Oria.no, ఇతర లైబ్రరీ సేవలను అందించడం ద్వారా లైబ్రరీ వనరులను సులభంగా యాక్సెస్ చేస్తుంది. [3] వారు పరిశోధన, ప్రత్యేక లైబ్రరీలు అలాగే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ కోసం అంతర్గత ఆపరేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ ఉత్పత్తులను కూడా అందిస్తారు. [4]

డేటాసైట్ లో సభ్యుడిగా బిబ్‌సిస్, నార్వేలో జాతీయ డేటాసైట్ ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. తద్వారా నార్వే లోని ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలన్నీ తమ పరిశోధన డేటాపై DOI ని ఉపయోగించడానికి అనుమతిస్తాయి.

బిబ్‌సిస్ ఉత్పత్తులు, సేవలు అన్నిటినీ సభ్య సంస్థల సహకారంతో అభివృద్ధి చేసారు.

చరిత్ర

[మార్చు]

BIBSYS 1972లో రాయల్ నార్వేజియన్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ లైబ్రరీ (Det Kongelige Norske Videnskabers Selskabs Bibliotek), నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైబ్రరీ, నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని కంప్యూటర్ సెంటర్ల ఉమ్మడి ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ప్రాజెక్టు ఉద్దేశం అంతర్గత లైబ్రరీ రొటీన్‌లను ఆటోమేట్ చేయడం. 1972 నుండి బిబ్సిస్ ట్రాండ్‌హీమ్‌లోని రెండు లైబ్రరీలకు లైబ్రరీ వ్యవస్థను సరఫరా చేసే స్థాయి నుండి నార్వేజియన్ పరిశోధన, ప్రత్యేక లైబ్రరీల కోసం జాతీయ లైబ్రరీ వ్యవస్థను అభివృద్ధి చేసి, నిర్వహించే వరకు అభివృద్ధి చెందింది. లైబ్రరీ వనరులను సులభంగా అందిస్తూ పరిశోధన, ప్రత్యేక లైబ్రరీల వినియోగదారులను కూడా చేర్చుకుంటూ లక్ష్యిత సమూహాలను విస్తరించుకుంది.

బిబ్‌సిస్ అనేది విద్య, పరిశోధన మంత్రిత్వ శాఖకు జవాబుదారీగా ఉండే పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీ. దీన్ని NTNUలో ఒక యూనిట్‌గా నిర్వహిస్తున్నారు. బిబ్‌సిస్ లైబ్రరీ సిస్టమ్‌తో పాటు, దాని ఉత్పత్తులలో బిబ్‌సిస్ ఆస్క్, బిబ్‌సిస్ బ్రేజ్, బిబ్‌సిస్ గ్యాలరీ, బిబ్‌సిస్ టైర్‌లు కూడా ఉన్నాయి. అప్లికేషన్‌లు, డేటాబేస్‌ల కార్యకలాపాలన్నిటినీ కేంద్రీయంగా బిబ్‌సిస్ లోనే నిర్వహిస్తారు. బిబ్‌సిస్ తన ఉత్పత్తులకు సంబంధించి, వాటితో సంబంధం లేని ప్రత్యేక సేవలనూ అందిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Language institute asks hackers to help (archived) in Aftenposten, 7 June 2002 "The Ivar Aasen Center is a member of Bibsys, which is a library data center offering services to all Norwegian University Libraries, the National Library, all college libraries, and a number of research libraries."
  2. Kulturell kampanjejournalistikk in Aftenposten 4 March 2009 "Et enkelt søk i Bibsys (et elektronisk biblioteksystem for hele landet, red.anm.)"
  3. Pilotprosjekt i det stille in Aftenposten 25 June 2009 "eller du kan låne den fra nærmeste bibliotek gjennom Bibsys."
  4. Harvard i spissen for utdanningsrevolusjon in Aftenposten 5 June 2014 "Mellom fem og ti nye studietilbud har meldt sin ankomst til sommeren og høsten, sier Frode Arntsen i Bibsys, som er ansvarlig for nettportalen."