Jump to content

బి.విజయసేన్ రెడ్డి

వికీపీడియా నుండి
బి.విజయసేన్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 మే 2020 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 22 ఆగస్టు 1970
హైదరాబాద్
తల్లిదండ్రులు జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి, రత్న
నివాసం హైదరాబాద్
వృత్తి న్యాయమూర్తి

బొల్లంపల్లి విజయ్‌సేన్‌ రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2020 మే 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బి. విజయ్‌సేన్‌ రెడ్డి 1970 ఆగస్టు 22లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో బి.సుభాషణ్‌ రెడ్డి, రత్న దంపతులకు జన్మించాడు. విజయ్‌సేన్‌రెడ్డి పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

కుటుంబ నేపథ్యం

[మార్చు]

ఆయన తండ్రి జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయ మూర్తిగా, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి ఏపీ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా, తెలంగాణ, ఏపీ లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తించాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

బి. విజయ్‌సేన్‌ రెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తరువాత 1994 డిసెంబరు 28న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో, అన్ని స్థాయి కోర్టుల్లోనూ రాజ్యాంగపరమైన కేసులతోపాటు సివిల్, క్రిమినల్‌ కేసుల్ని వాదించాడు. విజయ్‌సేన్‌రెడ్డిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ 2020 ఏప్రిల్ 20న సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది, ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలపడంతో నియామకాన్ని నోటిఫై చేస్తూ మే 1న కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.[3] విజయ్‌సేన్‌రెడ్డి 2020 మే 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (3 May 2020). "హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణం". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  2. HMTV (21 April 2020). "తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బీ విజయ్‌సేన్‌రెడ్డి". HMTV (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  3. Sakshi (2 May 2020). "హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  4. TV5 News (2 May 2020). "తెలంగాణ హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌ రెడ్డి" (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Telangana High Court. "HONOURABLE SRI JUSTICE B.VIJAYSEN REDDY". tshc.gov.in. Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.