బి.వి.వి.ప్రసాద్
బి.వి.వి.ప్రసాద్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | బొల్లిన వీర వెంకట ప్రసాద్ 21.11.1966 సూర్యారావుపాలెం |
వృత్తి | వ్యాపారం |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయుడు |
విద్య | బి.కాం. |
రచనా రంగం | కవిత్వం |
గుర్తింపునిచ్చిన రచనలు | ఆకాశం |
జీవిత భాగస్వామి | మాలతి |
సంతానం |
|
బంధువులు |
|
బి.వి.వి.ప్రసాద్ ప్రసిద్ధి పొందుతున్న సమకాలీన కవి.
వ్యక్తిగత జీవితం
[మార్చు]బొల్లిన వీరవెంకట ప్రసాద్ 21 నవంబరు 1966న జన్మించారు. ఆయన బాల్యం మాతామహులు, నలుగురు మేనమామలు ఉన్న ఉమ్మడికుటుంబంలో గడిచింది. ఆ తరువాత తల్లిదండ్రుల వద్ద ఏడవతరగతి వరకూ చాగల్లులోనూ, బీకాం రెండవ సంవత్సరం వరకూ తణుకులోనూ, చివరి సంవత్సరం కాకినాడలోనూ గడిచాయి. 1991లో మాలతితో వివాహమైంది. గాయత్రి, భార్గవి వారి సంతానం. చదువు ముగించాకా చాలాకాలం పాటు తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉండి, 2003లో పాఠశాల ప్రారంభించారు. మూడేళ్ళపాటు నడచిన పాఠశాల నష్టాల వల్ల ముగించుకుని తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.[1]
రచన రంగం
[మార్చు]బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం పట్ల ఆసక్తితో పలు కవిత్వ రచనలు చేశారు. స్కూలు చదువులో చిత్రకళతో ప్రారంభమైన సృజనాత్మక వ్యాసంగం, కళాశాల చదువుకు వచ్చేసరికి కవిత్వంగా మారింది. 1989లో తొలి పుస్తకం "ఆరాధన" (కవిత్వ సంకలనం) ప్రచురించేనాటికి కవిత్వం, కథలు, సాహిత్య తత్త్వచింతనలు రాసుకున్నారు. హైకూ ప్రక్రియలో రాసుకున్న కవితలతో 1995, 1997, 1999ల్లో వరుసగా దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి సంపుటాలు ప్రచురించారు. వీరి వచన కవిత్వం 2006లో "నేనే ఈ క్షణం" 2011లో "ఆకాశం" 2015లో "నీలో కొన్నిసార్లు" పేర్లతో సంపుటాలుగా వచ్చింది. 2015లో హైకూలు, హైకూపై వ్యాసాలూ కలిపి "బివివి ప్రసాద్ హైకూలు"గా వచ్చింది.
రచనల జాబితా
[మార్చు]- ఆరాధన (వచన కవిత్వం) - 1989
- దృశ్యాదృశ్యం (హైకూలు) - 1995
- హైకూ (హైకూలు) - 1997
- పూలురాలాయి (హైకూలు) - 1999
- నేనే ఈ క్షణం (వచన కవిత్వం) - 2006
- ఆకాశం (వచన కవిత్వం) - 2011
- నీలో కొన్నిసార్లు (వచన కవిత్వం ) - 2015
- ఊరికే జీవితమై (వచన కవిత్వం) - 2022
మూలాలు
[మార్చు]- ↑ ఆకాశం:కవితాసంకలనంలో బి.వి.వి.ప్రసాద్ వివరాలు