బి. ప్రసాదమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి. ప్రసాదమూర్తి (బి. ఆర్. వి. ప్రసాదమూర్తి) తెలుగు కవి, రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

అతను పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులో నివాసిస్తున్నాడు.

అతను 1999లో “కలనేత” కవితా సంపుటితో తెలుగు కవితా ప్రవాహంలో రచనా ప్రస్థానంలోకి అడుగు పెట్టాడు. 2007లో "మాట్లాడుకోవాలి" కవితా సంఫుటిని వెలువరించాడు. 2010లో “నాన్న చెట్టు” 2014లో “పూలండోయ్ పూలు”, 2016లో “చేనుగట్టు పియానో” కవితా సంపుటాలను వెలువరించాడు. “ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం” అనే ఈయన పరిశోధనా గ్రంథం 2017లో పుస్తకంగా వెలువడింది. అసాధారణ వాక్య నిర్మాణం, నిత్యనూతన శైలీ శిల్ప చాతుర్యం ఇతని కవిత్వానికి అపురూప అలంకారాలు.[1]

పురస్కారాలు[2][మార్చు]

 • 2008 : బంగారు, తామ్రనంది అవార్డు - శ్రీ శ్రీ డాక్యుమెంటరి.
 • 2011 : నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం
 • 2012 : ఢిల్లీ తెలుగు అకాడెమి సాహిత్య పురస్కారం
 • 2014 : సోమసుందర్ సాహితీ పురస్కారం
 • 2015 : ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
 • 2016 : విశ్వకళా పీఠo అవార్డు
 • 2016 : రొట్టమాకుల రేవు సాహిత్య పురస్కారం
 • 2016 :శాంతినారాయణ పురస్కారం - చేనుగట్టు పియానో.[3]
 • ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం
 • స్మైల్ సాహితీ పురస్కారం

మూలాలు[మార్చు]

 1. "డా. ప్రసాదమూర్తి". Archived from the original on 2018-07-05. Retrieved 2018-06-23.
 2. "పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో".
 3. "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదానోత్సవం".

బయటి లంకెలు[మార్చు]