Jump to content

బీజామృతం

వికీపీడియా నుండి

బీజామృతం విత్తన శుద్ధి కి ఉపయోగించే ఒక ద్రావణం. ఈ ద్రావణాన్ని , విత్తనాలను పంటలో విత్తే ముందు విత్తనానికి ఏ ఇతర శీలింద్రాలు , పురుగులు ఆశించకుండా , ఆరోగ్యంగా మొలకెత్తడానికి విత్తనశుద్ధి గా వాడతారు.

తయారీ విధానం

[మార్చు]

బీజామృత తయారీకి రసాయన రహిత సేంద్రియ పదార్థాలను మాత్రమే వాడుతారు. దేశీయ పశువుల మూత్రం, పేడను మాత్రమే వాడాల్సి ఉంటుంది.

కావలసిన పదార్థాలు

[మార్చు]

1. దేశీయ పశువుల మూత్రం - 5లీ.

2. నీరు - 20లీ.

3. దేశీయ పశువుల పేడ - 5కి.

4. సున్నం - 50 గ్రా.

విధానం

[మార్చు]

ఒక పాత్రలో 20 లీ . నీరు , 5 లీ . దేశీయ పశువుల మూత్రం పోసి , 50 గ్రా , సున్నం వేసి బాగా కలియబెట్టాలి . 5 కి . పేడను గుడ్డలో మూటకట్టి ఈ పాత్రలో పూర్తిగా మునిగేటట్టు ఉంచి రాత్రంతా వ్రేలాడదీయాలి . మరునాడు ఉదయం పేడ మూటను అదే పాత్రలో గట్టిగా పిండి , మూటలోని పిప్పిని పడేయాలి . మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి. ఇది నిలువ ఉండదు.[1]

వాడే విధానం

[మార్చు]

1.ఈ ద్రావణాన్ని విత్తనశుద్ధికి వాడాలి

2.నార్ల వేర్లను మిశ్రమంలో ముంచి నాటాలి .

3.విత్తడానికి ముందు విత్తనాలను ఈ మిశ్రమంలో తడిపి , నీడలో ఆరబెట్టి , విత్తుకోవాలి .

4.ఈ ద్రావణం ఒక క్వింటాల్ విత్తనాలకు సరిపోతుంది .

ఉపయోగం

[మార్చు]

1.విత్తనం బాగా మొలకెత్తుతుంది.

2.విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నియంత్రిస్తుంది.

3.నారుకు వచ్చే తెగుళ్లను నియంత్రిస్తుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "బీజామృతం తయారీ ఎలా?". సాక్షి దినపత్రిక 9 Jun, 2014.
  2. వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.
"https://te.wikipedia.org/w/index.php?title=బీజామృతం&oldid=4339102" నుండి వెలికితీశారు