Jump to content

బీవీ నాగరత్న

వికీపీడియా నుండి
(బీవీ నాగరత్నం నుండి దారిమార్పు చెందింది)
గౌరవ న్యాయమూర్తి
జస్టిస్‌ బీవీ నాగరత్న
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
In office
31 ఆగష్టు 2021 – ప్రస్తుతం
Nominated byఎన్.వి రమణ
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
In office
18 ఫిబ్రవరి 2008 – 30 ఆగష్టు 2021
Nominated byకె. జి. బాలకృష్ణన్
Appointed byప్రతిభా పాటిల్
వ్యక్తిగత వివరాలు
జననం (1962-10-30) 1962 అక్టోబరు 30 (వయసు 62)
పాండవపుర , మండ్య జిల్లా, కర్ణాటక రాష్ట్రం[1]
జీవిత భాగస్వామిగోపాల కృష్ణ
తండ్రిఎంగలగుప్పె సీతారామయ్య వెంకటరామయ్య
కళాశాలఢిల్లీ యూనివర్సిటీ

బెంగుళూరు వెంకటరామయ్య నాగరత్న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆమె కర్ణాటక రాష్ట్ర హైకోర్టు, న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా 2008 నుండి 2021 వరకు పని చేసింది. ఆమె 30 ఆగష్టు 2021న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బీవీ నాగరత్న 30 అక్టోబర్ 1962న కర్ణాటక రాష్ట్రం, మాండ్య జిల్లా, పాండవపురలో జన్మించింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేసింది. నాగరత్న తండ్రి ఈఎస్ వెంకట్రామయ్య గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1989 జూన్ 1989 డిసెంబర్ వరకు పని చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

బీవీ నాగరత్న 1987లో న్యాయవాదిగా కర్ణాటక బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆమె 2008 ఫిబ్రవరి 18న కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమై, 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా నియమితురాలైంది. ఆమె 31 ఆగష్టు 2021న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది. సుప్రీంకోర్టు జడ్జి పదవుల కోసం తొమ్మిది మంది పేర్లను చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. అందులో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ బివి నాగరత్న తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యే అవకాశం ఉంది.[3]

ఒకవేళ సీనియారిటీ ప్రకారం 2027లో సీజేఐ కానున్నారు. సెప్టెంబరు 24, 2027 నుంచి అక్టోబరు 30, 2027 వరకూ 36 రోజులపాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్న తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్రకెక్కనుంది.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. https://www.deccanherald.com/state/top-karnataka-stories/b-v-nagarathna-the-new-supreme-court-judge-with-roots-in-mandya-village-1023838.html
  2. Andrajyothy (31 August 2021). "సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం". Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
  3. The Indian Express (26 August 2021). "Who is BV Nagarathna, the Judge who could become India's first woman CJI" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  4. 10TV (31 August 2021). "చరిత్ర సృష్టించిన ముగ్గురు మ‌హిళా జ‌డ్జిల గురించి తెలుసుకోండి" (in telugu). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. TV9 Telugu (18 August 2021). "Chief Justice: సుప్రీమ్ కోర్టు జడ్జీల కోసం తొలిసారిగా ముగ్గురు మహిళల పేర్లు నమోదు.. తొలి సీజేఐగా నాగరత్న అయ్యే ఛాన్స్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (31 August 2021). "సర్వోన్నత న్యాయస్థానంలో... సరికొత్త చరిత్ర". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.