Jump to content

బీ.ఎం.ఆర్ గ్రూప్

వికీపీడియా నుండి
బీ.ఎం.ఆర్ (B.M.R) గ్రూప్
రకంప్రైవేట్ కంపెనీ
పరిశ్రమఆక్వా
స్థాపన1991
స్థాపకుడుబీద మస్తాన్‌రావు (బీ.ఎం.ఆర్)
ప్రధాన కార్యాలయంచెన్నై, తమిళనాడు
కీలక వ్యక్తులు
బీ.ఎం.ఆర్ - (చైర్మన్), బీద మనోజ్, మహితేజ్ యాదవ్
ఉత్పత్తులురొయ్యల హేచరీ, సాగు, ఆహార ఉత్పత్తి.

బి.ఎం.ఆర్ గ్రూపు టైగర్ రొయ్యల సాగుతో 1991లో ప్రారంభించిన కంపెనీ. [1][2]

చరిత్ర

[మార్చు]

టైగర్ రొయ్యల సాగుతో 1991లో ప్రారంభించిన బీ.ఎం.ఆర్ కంపెనీ, 1997లో ఈ టైగర్ రొయ్యలు వివిధ వైరస్లు సోకి నష్టం రాగా, వనామి రొయ్యల సాగుని ప్రారంభించింది. దాదాపు 250 ఎకరాలలో ఈ వనామి రొయ్యలు సాగు చేస్తుంది. వీటికి చైనా, వియత్నాం, మలేసియా, థాయిలాండ్ వంటి విదేశాలలో మంచి గిరాకీ ఉండడంతో వీటిని అక్కడికి ఎగుమతి చేస్తుంది. తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తూ ఎగుమతులు చేస్తుంది.[3]

వనామి రొయ్యలకి ఆదరణ బాగా రావడం తో భారత ప్రభుత్వం కంపెనీకి ప్రోత్సాహకాలు అందించి పలు నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల కోసం ఒక పైలట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టారు. ఈ ఉత్పత్తులు (నాణ్యమైన సీడ్ & ఆహారం) తక్కువ ధరకు ప్రతి స్థానిక రైతులకు అందాలని మొదలుపెట్టి విజవంతంగా ముందుకు తీసుకెళ్ళింది. 1994 లో 150 మెట్రిక్ టన్నుల నుండి 2014లో 2,90,000 మెట్రిక్ టన్నుల మార్కుకు చేరుకుంది.[4][5]

అవార్డులు

[మార్చు]

2014 లో రొయ్యల పెంపకంలో దేశంలోనే ఉత్తమ హేచరీగా అవార్డు సాధించింది.[ఆధారం చూపాలి] ఈ అవార్డును కేంద్ర మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా అందించాయి.

మూలాలు

[మార్చు]
  1. "India's first broodstock inaugurated by BMR industries". The Times of India.
  2. "BMR Group donates 1 cr to Ap CMRF". Etv Bharat. Archived from the original on 2021-02-12.
  3. "AP CM to visit BMR Industries, Nellore". The Hindu.
  4. "BMR Industries largest shrimp feed producer in india". Economic Times.
  5. "BMR became first India's BAP Shrimp supplier". Intra Fish.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి మూలాలు

[మార్చు]

బీ.ఎం.ఆర్ గ్రూప్ జాలస్థలి