బుధ వినాయక దేవాలయం
స్వరూపం
బుధ వినాయక దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | జాజ్‌పూర్ జిల్లా |
ప్రదేశం: | జాజ్‌పూర్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | దేవాలయ శైలీ |
బుధ వినాయక దేవాలయం, ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లా, జాజ్‌పూర్ పట్టణంలోని బైతరణి నది సమీపంలో ఉన్న వినాయకుడి దేవాలయం. యజ్ఞ వరాహ దేవాలయానికి చాలా సమీపంలో ఉన్న ఈ దేవాలయంలోని విగ్రహం దశాశ్వమేధ ఘాట్ సమీపంలో కనుగొనబడింది.
ఆర్కియాలజీ
[మార్చు]కళింగ కాలంలో ఖనోలైట్ రాయిని ఉపయోగించి ఈ దేవాలయం నిర్మించబడింది. దేవాలయ శిల్పాలను రక్షించడానికి ఇటీవల సున్నంతో ప్లాస్టర్ చేయబడింది. జైన తీర్థంకర శాంతినాథ్‌తోపాటు విష్ణువు, మహిషమర్దిని వివిధ వదులుగా ఉన్న శిల్పం కూడా కనుగొనబడింది. అన్నింటి ఆధారంగా ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్పవచ్చు. ఈ దేవాలయం కూడా సోనేపూర్, భువనేశ్వర్‌లోని ఇతర దేవాలయాల మాదిరిగానే రేఖ, పిధా నిర్మాణాలను కలిగి ఉంది. ఇక్కడ వినాయక చవితి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Archaeological survey Indira Gandhi National Centre for the Arts" (PDF). Archived from the original (PDF) on 21 June 2011. Retrieved 20 November 2010.