బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌
ఎమ్మెల్యే
Assumed office
2019 - ప్రస్తుతం
వ్యక్తిగత వివరాలు
జననం1972
శివపురం,టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ
పదవులు
కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిలక్ష్మి
సంతానంఅమృత భార్గవి, వెంకటసాయి, లక్ష్మీనారాయణ
తల్లిదండ్రులుబి.చినపేరయ్య, లక్ష్మమ్మ
నివాసంకనిగిరి

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో కనిగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 15 మే 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో బి.చినపేరయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్‌ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 సెప్టెంబర్ 2021. Retrieved 17 September 2021. Check date values in: |archivedate= (help)
  2. iDreamPost (8 June 2021). "ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే" (in ఇంగ్లీష్). Archived from the original on 17 సెప్టెంబర్ 2021. Retrieved 17 September 2021. Check date values in: |archivedate= (help)
  3. Sakshi (10 April 2019). "దీర్ఘకాలిక సమస్యలకు చెక్‌!". Archived from the original on 17 సెప్టెంబర్ 2021. Retrieved 17 September 2021. Check date values in: |archivedate= (help)