బెండకాయ కూర
Jump to navigation
Jump to search

ఆంధ్ర కూరగాయ వంటలలో బెండకాయ ఒకటి. దీనిని పలు విధాలుగా చేస్తుంటారు. వాటిలో ఒకటి పులుసు. దాని తయారీ విధానం
కావలసిన పదార్ధాలు[మార్చు]
- బెండకాయలు 1/4 kg
- ఉల్లిపాయ 1
- టొమాటో 2
- చింతపండు పులుసు 1/4 కప్పు
- పసుపు 1/4 tsp
- కారం పొడి 1 tsp
- గరం మసాలా 1 tsp
- అల్లం వెల్లుల్లి 1 tsp
- కరివేపాకు 1 tsp
- ఉప్పు తగినంత
- నూనె 3 tbsp

బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి బెండకాయ ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పులుసు, అరకప్పు నీళ్ళు పోసి కలియబెట్టి మరో పదినిమిషాలు నిదానంగా చిన్న మంటపై ఉడికించాలి.