బెండి కొండ (క్షేత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నువ్వు కొండకు వ్యవహారిక నామం బెండి కొండ. పూర్వపు విశాఖ జిల్లా (ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా) టెక్కలి తాలూకా పాత టెక్కలి జమీన్ లో ఉంది.

నువ్వు కొండమహాత్మ్యం[మార్చు]

ఒకప్పుడు ఈ కొండ ఇద్దరు వర్తకులకు చెందిన నువ్వుల రాశి. వారు తిలాధిపతి శనీశ్వరునికి తృప్తి కలిగించకపోవటం వలన ఆగ్రహం కలిగి వాళ్ళ నువ్వుల రాశిని పెద్ద కొండగా మార్చాడట. వారు పశ్చాత్తాపం చెంది మళ్ళీ స్వామిని ప్రార్ధిస్తే, మళ్ళీ నువ్వుల రాశిగా మార్చటానికి వీలు లేదని చెప్పి , వాళ్లకు ప్రీతి కలిగించటానికి  తాను ఆకొండపై నివాసం ఏర్పాటు చేసుకొని భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటానని చెప్పి , శనీశ్వరుడు అంతర్ధానమయ్యాడు .

రామయోగి[మార్చు]

రామయోగి అనే ఒక సాధువు పెరుగు మాత్రమే తింటూ , మితభాషిగా ఉంటూ ఈ కొండపై తపస్సు చేసి , 40రోజులకు పైగా నిరాహారంగా ఉండి 4-3-1938 న ఈశ్వరనామ సంవత్సర శుక్లపక్ష విదియ గురువారం అపరాహ్ణంలో సిద్ధి పొందాడు . అప్పటినుంచి ఈకొండ  నువ్వుకొండ శ్రీ రామ క్షేత్రంగా, శ్రీరామయోగి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ రామయోగిపై టెక్కలి ఆంగ్ల ఉన్నత పాఠశాల సహోపాధ్యాయుడు మండలీక సీతారామయ్య ‘’నువ్వు కొండ యోగి రామ శతకం ‘’రాశాడు.

నువ్వు కొండ యోగి రామ శతకం[మార్చు]

ఇందులో ప్రార్ధన, శతకానికి ప్రేరణ, సంక్షేపంగా నువ్వుకొండ చరిత్ర, నువ్వు కొండ క్షేత్ర పాలక శనీశ్వర అష్టకం, రామయోగి ద్వాదశ మంజరి స్తోత్రం, శతక మాహాత్మ్యం, శతక సంకల్పం, రామయోగి శతకం, టిప్పణి ఉన్నాయి.[1]

నేపథ్యం[మార్చు]

గ్రంథకర్త వియ్యంకుడు ఒక సారి టెక్కలి వచ్చి, పక్షవాతంతో బాధపడుతున్న కవిని చూసి పద్యాలతో రామయోగిని ప్రస్తుతిస్తే నయం అవుతుందని సలహా ఇవ్వగా, శతకరచనకు ఉపక్రమించాడు కవి. ఈ కవిగారే చాలా విపులంగా "నువ్వుకొండ మహాత్మ్యం" కూడా రాశానని చెప్పుకొన్నాడు.

మచ్చుకు యోగి రామ శతకంలోని ఒక పద్యం[మార్చు]

రామయోగి ద్వాదశ మంజరి స్తోత్రం లో ఒకపద్యం –

శ్రీరామ భక్తుడై చెలగుచు నువ్వు కొండ
రాల సందున డాగురామయోగి
రాముడే కాని వేరేమి లేదని చాటు
పూర్ణ వైరాగ్యుడౌ పుణ్యమూర్తి
పెరుగుమాత్రమె త్రాగి  పెను తపస్సును జేసి
పరమాత్ము నెరిగిన పరమహంస
పదునెనిమిది యగు వందలేబది తొమ్మి
దిశక మీశ్వర ఫాల్గుణ శుచి పక్ష

మందు విదియను   భ్రుగువాసరాపరాహ్ణ
మందు నలువదినాళ్ళనిశమున  
బ్రహ్మ పద మొ౦ది తిలరాశి పర్వతమున
రాముడి వెలసెను జూడీరంజితంబుగ

మూలాలు[మార్చు]

  1. "నువ్వుకొండ యోగి రామ శతకం" (PDF). /ia801601.us.archive.org.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు[మార్చు]