బెన్ ఓక్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెన్ ఓక్రి
బెన్ ఓక్రి
పుట్టిన తేదీ, స్థలం (1959-03-15) 1959 మార్చి 15 (వయసు 64)
మిన్నా, నైజీరియా
వృత్తిరచయిత
రచనా రంగంఫిక్షన్, వ్యాసాలు, కవిత్వం
సాహిత్య ఉద్యమంఆధునికోత్తరవాదం, వలసవాదోత్తర విధానం
గుర్తింపునిచ్చిన రచనలుది ఫామిష్డ్ రోడ్, ఎ వే ఆఫ్ బీయింగ్ ఫ్రీ, స్టార్ బుక్, ఎ టైం ఫర్ న్యూ డ్రీమ్స్
పురస్కారాలుబుకర్ బహుమతి

బెన్ ఓక్రి నైజీరియా దేశానికి చెందిన కవి, నవలా రచయిత.[1] 1991లో ది ఫామిష్డ్ రోడ్ నవలకు బుకర్ బహుమతి గెలుచుకున్న బెన్, ఆ పురస్కారాన్ని అందుకున్న అతిచిన్న వయస్కుడిగా (32 ఏళ్ళు) రికార్డ్ సృష్టించాడు.[2]

జననం[మార్చు]

బెన్ ఓక్రి 1959, మార్చి 15న నైజీరియా, మిన్నా గ్రామంలో జన్మించాడు.[3] తన 2వ ఏట తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్ళపాలటు లండన్ బెన్ ఓక్రి వెళ్ళిన తిరిగి నైజీరియా వచ్చాడు.[4]

రచనా ప్రస్థానం[మార్చు]

మొదట్లో భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్న బెన్ ఓక్రి, ఆ కోర్స్‌లో సీట్ రాకపోవటంతో సాహిత్యరంగంకు వచ్చాడు. ఆఫ్రికా దేశపు స్థానిక జాతీయ సంస్కృతుల యొక్క విధ్వంసాన్ని, యూరప్ దేశాల వలసవాద దోపిడీని, నైజీరియా దేశ రాజకీయ అవినీతిని, ఆధునికానంతర కాలపు మానవ సంక్షోభం, నైజీరియా ప్రజల ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబింపజేశాడు.

దేశ రాజకీయాలపై, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో అనేక రచనలు చేశాడు. దాంతో బెన్ పేరును ప్రభుత్వం డెత్ లిస్టులో పెట్టింది.[4] దాంతో 1978లో నైజీరియా నుంచి లండన్ వెళ్లి తులనాత్మక సాహిత్యం చదివాడు.

నవలలు[మార్చు]

 1. ఫ్లవర్స్ అండ్ షాడోస్ (హార్లో: లాంగ్మాన్, 1980)
 2. ది ల్యాండ్‌స్కేప్ వితిన్ (హార్లో: లాంగ్మాన్, 1981)
 3. ది ఫామిష్డ్ రోడ్ (లండన్: జోనాథన్ కేప్, 1991)
 4. సాంగ్స్ అఫ్ ఎన్హాన్టమెంట్ (లండన్: జోనాథన్ కేప్, 1993)
 5. ఆథోనిషింగ్ ది గాడ్స్ (లండన్: వీడెన్ఫెల్డ్ & నికోల్సన్, 1995)
 6. డేంజరస్ లవ్ (లండన్: వీడెన్ఫెల్డ్ & నికోల్సన్, 1996)
 7. ఇన్ఫినిట్ రిచెస్ (లండన్: వీడెన్ఫెల్డ్ & నికోల్సన్, 1998)
 8. ఇన్ ఆర్కాడియా (వీడెన్ఫెల్డ్ & నికోల్సన్, 2002)
 9. స్టార్‌బుక్ (లండన్: రైడర్ బుక్స్, 2007)
 10. ది ఏజ్ ఆఫ్ మాజిక్ (లండన్: జ్యూస్ హెడ్, 2014)
 11. ది ఫ్రీడమ్ ఆర్టిస్ట్ (లండన్: హెడ్ ఆఫ్ జ్యూస్, 2019)

పురస్కారాలు[మార్చు]

 1. 1991 - బుకర్ బహుమతి - ది ఫామిష్డ్ రోడ్ (నవల)

మూలాలు[మార్చు]

 1. "Ben Okri Archived 2012-03-02 at the Wayback Machine," British Council, Writers Directory.
 2. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (18 March 2019). "బెన్ ఓక్రి". మామిడి హరికృష్ణ. Archived from the original on 28 March 2019. Retrieved 28 March 2019.
 3. Maya Jaggi, "Free spirit," The Guardian, 10 August 2007.
 4. 4.0 4.1 Stefaan Anrys, "Interview with Booker Prize laureate Ben Okri," Mondiaal Nieuws, 26 August 2009.