బెలీజ్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవనాగరిలో "ఓం" గుర్తు

బెలీజ్‌‌లో హిందూ మతం మైనారిటీ విశ్వాసం. 2010 జనాభా లెక్కల ప్రకారం, బెలీజ్‌ జనాభాలో 0.2% హిందువులు . [1]

జనాభా శాస్త్రం[మార్చు]

బెలీజ్‌‌లో హిందూమతం
2000 2010
సంఖ్య % సంఖ్య %
మొత్తం జనాభా 232,111 304,106
- హిందూ జనాభా 367 0.2 612 0.2

అయితే, అసోసియేషన్ ఆఫ్ రిలిజియన్ డేటా ఆర్కైవ్స్ ప్రకారం 2005 నాటికి, 2.0% మంది హిందువులుగా గుర్తించారు. [2] ఇతర వనరుల ప్రకారం ఇది 2.3%. [3]

చరిత్ర[మార్చు]

బెలీజ్‌‌లోని హిందూ సమాజం ఎక్కువగా 1950లలో బెలీజ్‌ బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో వచ్చింది. సమాజంలో దాదాపు పూర్తిగా అందరూ సింధీలే. దానిలో కొన్ని సాంస్కృతిక భేదాలు ఉన్నాయి.

వర్తమానం[మార్చు]

బెలీజ్‌ జనాభాలో 3.9% భారతీయులు ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ మంది క్రైస్తవులు. దాదాపు 40% మంది ఇప్పటికీ హిందువులు. [4]

బెలీజ్‌లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒకటి బెలీజ్‌ నగరం లోను, రెండవది కొరోజల్ లోనూ (సుఖ్ శాంతి ఆలయం) ఉన్నాయి. [5] దీపావళి, [6] జన్మాష్టమి [7] వంటి పండుగలను హిందువులు ఈ ఆలయాల్లో జరుపుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. Belize Population and Housing Census 2010: Country Report (PDF). Belmopan, Belize C.A.: he Statistical Institute of Belize. 2013. p. 23. Archived from the original (PDF) on 27 January 2016. Retrieved 12 September 2015.
  2. "Belize, Religion And Social Profile | National Profiles | International Data | TheARDA". www.thearda.com. Archived from the original on 2015-11-22. Retrieved 2022-01-21.
  3. "Religious Intelligence - Country Profile: Belize". January 17, 2009. Archived from the original on 2009-01-17.
  4. Project, Joshua. "South Asian, general in Belize". joshuaproject.net.
  5. "Google Maps".
  6. "Indian Community Celebrates Diwali in Belize | Channel5Belize.com".
  7. [1][dead link]