బెల్లి లలిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెల్లి లలిత (26 ఏప్రిల్ 1974 - 26 మే 1999) ప్రముఖ ఉద్యమ పాటల గాయని, తెలంగాణ కళాసమితి వ్యవస్థాపకురాలు[1]. ఈమె 'తెలంగాణ గాన కోకిల' గా పేరుగాంచింది. ఆమె తెలంగాణలోని భువనగిరిలో 1999 మే 26న హత్య గావించబడింది[2].

కుటుంబ జీవితం[మార్చు]

బెల్లి లలిత నిరుపేద కుటుంబంలో పుట్టిన ముద్దుల ఆడబిడ్డ. ఒక అన్న బెల్లి కృష్ణకు, తోబుట్టువుల్లో లలిత నడిపి చెల్లె. ఇక్కడ బెల్లి లలిత కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతా ఉమ్మడి కుటుంబంగా ఉంటూ.. సందడి సందడిగా.. ఉండేది. కొత్తగా చూసి న వారికి ఓ పండుగలా ఉండేది. ప్రాథమిక విద్యకూడా పూర్తికాకుండానే ఆగిపోయిన చదువుతో.. కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నప్పటి నుంచి భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్‌మిల్లులో కార్మికురాలిగా చేరింది. జీవన పోరాటంలో కార్మికురాలుగా.. పనిచేస్తూనే.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. 28 ఏళ్లు నిండకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయింది.

సాహిత్య, గాన, రాజకీయ కృషి[మార్చు]

తనదైన జీవితంనుంచి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చి దిద్దాయి. సరిగ్గా అప్పుడే.. భువనగిరిలో సాహితీ మిత్రమండలి తన కార్యక్రమాలతో ప్రత్యామ్నాయ సాహిత్య, రాజకీయ కృషిని ప్రారంభించింది. ప్రతి బుధవారం అధ్యయన తరగతులు, సాహిత్యసభలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు కార్యాచరణను చేపట్టింది. సీఐటీయూ రివిజనిస్టు రాజకీయాల డొల్లతనాన్ని త్వరగానే తెలుసుకున్న బెల్లి లలిత.. నిజమైన ఉద్యమ కార్యాచరణను ఎన్నుకున్నది. ఆ క్రమంలో.. భువనగిరిలో ఓ నిత్యచైతన్య జ్వాలయై వెలిగింది. భువనగిరిలోని బస్తిల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టిం ది. మహిళలను చైతన్య పరిచి, సంఘటితం చేసేందుకు ‘మహిళా స్రవంతి’ని ఏర్పాటుచేసింది. మహిళల హక్కుల కోసం, యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్‌పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది. భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపువృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరక కూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదంవూడుల చెంతకు చేర్చింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా. అక్కడ ప్రత్యక్షమై తనదైన పాటలతో, మాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు జీవితకాలాన్నంతా వెచ్చించింది.

1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి ‘దగాపడ్డ తెలంగాణ’ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్యపాత్ర పోషించింది.రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా, గుసగుసగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. భువనగిరి సభ మొదలు..నాటి నుంచీ.. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారింది బెల్లి లలిత. తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. తెలంగాణ కళామండలి రాష్ట్ర కో-కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పాటే జీవితంగా ఎంచుకున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే..తెలంగాణ ఉద్యమానికి జవ జీవాలు పోసింది బెల్లి లలిత.

హత్య విషయాలు[మార్చు]

తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ.. పాలకులను నిలదీసిందామె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపు అయ్యింది. రాజ్యం కక్ష గట్టి కత్తి నూరింది. విముక్తి పాటను పాడిన గొంతును తెగ నరికింది. కాలికి గజ్జె కట్టి ఆటఆడి పాట పాడినందుకు.. ఆడిపాడిన ఆ అవయవాలను ఖండఖండాలుగా 17 ముక్కలుగా నరికిందీ రాక్షస రాజ్యం. 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్‌మిల్లు నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తనని బయటకి వెళ్లింది. అంతే.. రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చని రాష్ట్రవ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలకరిస్తూ.. నిత్యం తమ కళ్లముందు తిరిగే బెల్లిలలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆబాలగోపాలం రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీశారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో.. కొందరి ప్రమేయముందని వారి కుట్రకు బలయ్యే ప్రమాదముందని వెంటనే తన చెల్లెలిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు చేశారు. ధర్నా, రాస్తారోకోలతో ప్రభుత్వ దమన నీతి ని ఖండించారు. ఆందోళనలు జరుగుతుండగానే ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు. దానిలో ఆకుకు అందని, పోకకు పొందని కాకమ్మ కథలు రాశారు. ఆ లేఖ సారాంశం మొత్తం లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగానే ఉండటంతో.. అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరును అనుమానించారు. ఇంతలో నాలుగోరోజు భువనగిరి తూర్పుభాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయబావులలో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే.. ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలవిల లాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు. అయినా.. ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా.. బెల్లి లలితవి కావని బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్లి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ‘బెల్లి లలితను అలా ముక్క లు ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అన్నింటిలాగే బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేస్తాం గదా’ అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తేలాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలనుంచి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ము కాస్తున్నదని విమర్శలు రావడంతో.. చివరికి ఇద్దరు అనుమానితులను తెరమీదికి తెచ్చారు. ఆ ఇద్దరి చేత అనేక అసత్యాలు చెప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో.. బెల్లి లలిత వ్యక్తిత్వానికి మసి పూసేందుకు ప్రభుత్వం, అప్పటి హోంమంత్రి మాధవడ్డి కూడా ప్రయత్నించాడు. అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలోనే బెల్లి లలితను వ్యక్తిగత కక్షలతోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. అయితే.. బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవ్వరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడ కూతురును రాక్షసంగా ముక్కలు ముక్కలుగా నరికిచంపి, పైగా అపనిందలు వేస్తున్నారని ప్ర€ASజలంతా ఈసడించుకున్నారు. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపు మాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్యచేశారు. ఈ దుర్మార్గాన్నంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతుల రక్తపు మరకలను దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయ త్నం చేసింది. కొంత మంది అమాయకంగా ఇదినిజమేనని నమ్మారు కూడా. కానీ.. ఇది పచ్చి అబద్ధం. ఇది రాజ్యం చేసిన హత్య. రాజ్యం కొంతమందిని ఆయుధాలుగా వాడుకుని తప్పించుకున్నదిపజలు నెమ్మదిగా నైనా నిజాన్ని గుర్తించారు. పాలకుల కుట్రలను ఓడించారు. బెల్లిలలిత గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపామని కలగన్న పాలకులకు కోట్ల గొంతులలో తెలంగాణ పాట హోరెత్తుతున్నది. వలసపాలకులు పారిపోక తప్పని పరిస్థితి తెస్తున్నది. ఇదంతా.. బెల్లి లలిత త్యాగాల్లోంచి వచ్చిన వారసత్వమే. బెల్లి లలిత జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లె భర్త ముక్క కరుణాకర్, అక్క భర్త శ్రీరాములును ఈ రాజ్యమే దుర్మార్గంగా హత్యచేసింది. ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న రాజ్యం రక్తదాహానికి పచ్చని గూడు కకావికలమైంది.

మూలాలు[మార్చు]

  1. "Belli Lalitha Profile & Death Secret". 8 August 2016.[నమ్మదగని మూలం?]
  2. http://articles.timesofindia.indiatimes.com/2001-09-13/hyderabad/27231785_1_forensic-science-dna-fingerprinting-cdfd[dead link]

బయటి లంకెలు[మార్చు]