ఎలిమినేటి మాధవ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలిమినేటి మాధవరెడ్డి
ఆంధ్రప్రదేశ్ పూర్వపు హోం మంత్రి
In office
సెప్టెంబరు 1995 నుండి 1999
వ్యక్తిగత వివరాలు
జననం(1949-05-01)1949 మే 1
వడపర్తి, భువనగిరి, నల్గొండ, తెలంగాణ
మరణం2000 మార్చి 7(2000-03-07) (వయసు 51)
ఘటకేసర్, తెలంగాణ
మరణ కారణంమందుపాతర
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామిఎలిమినేటి ఉమామాధవరెడ్డి
Known forరాజకీయ నాయకుడు

'ఎలిమినేటి మాధవరెడ్డి' ( 1949 మే 1 - 2000 మార్చి 7) తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశాడు. భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరుపున 1985 నుండి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగాడు. ప్రజా మన్నన పొందిన వ్యక్తి. 2000 మార్చి 7 రోజున రాత్రి యాదగిరి గుట్ట నుండి హైదరాబాదుకు తిరిగి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు గురై దుర్మరణం పాలయ్యారు.[2]

ప్రారంభ జీవితం[మార్చు]

అతను నరసారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. అతను ఉమాదేవిని వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు (సృజన, శ్వేత) ఒక కుమారుడు (సందీప్).

విద్య[మార్చు]

అతను 1974లో బి.ఇ (ఎలక్ట్రికల్ ఇంజనీరు) డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి పొందాడు.

జీవితం[మార్చు]

అతను 1981లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అతను వడపర్తి (తన జన్మ ప్రదేశం) నుండి ఏకగ్రీవంగా సర్పంచ్ గా 1981 మే 5 న ఎన్నికయ్యాడు. అతను తెలుగు దేశంపార్టీ తరపున భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 1985 లో గెలుపొందాడు.

అతను తెలుగుదేశంప్రభుత్వంలోని నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గాలలో వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేసాడు. అతను ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో ఆరోగ్య శాఖా మంత్రిగా 9 నెలల పాటు (డిసెబరు 1994 నుండి 1995 ఆగస్టు) పనిచేసాడు. చంద్రబాబు మంత్రి వర్గంలో హోం మంత్రిగా నాలుగు సంవత్సరాలు (1995 సెప్టెంబరు నుండి 1999) వరకు 1999 అక్టోబరు 11 నుండి తన మరణం వరకు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్‌మెంటు మంత్రిగా కొనసాగాడు.

మరణం[మార్చు]

అతను ఘటకేసర్ నక్సలైట్లు పెట్టిన మందుపాతర కారణంగా 2000 మే 7 న మరణించాడు.[2] తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో గల శ్రీశైలం ఎడమ కాలువకు అతని జ్ఞాపకార్థం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పేరును పెట్టారు.[3][4]

మూలాలు[మార్చు]

  1. "In memory of late Sri A. Madhava Reddy". Archived from the original on 2018-01-26. Retrieved 2018-07-05.
  2. 2.0 2.1 Naidu to induct former minister's widow into cabinet on Monday
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-15. Retrieved 2018-07-05.
  4. తెలంగాణ మ్యాగజైన్ (10 April 2019). "ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం)". magazine.telangana.gov.in. శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే. Archived from the original on 31 జూలై 2019. Retrieved 31 July 2019.