బేగం హజరత్ మహల్ ప్రకటన
స్వరూపం
(బేగం హజరత్ మహల్ ప్రకటన నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
1858 నంవంబరు 1న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, ఇండియా పరిపాలనా బాద్యతను స్వీకరించిన విక్టోరియ రాణి దేశీ పాలకులను, సంస్థానాధీశులను మంచి చేసుకోడనికి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనకు ప్రతిగా అవధ్ మహారాణి బేగం హజరత్ మహల్ (Begum Hazrat Mahal), అవధ్ రాజుగా ప్రకంచబడిన తన కుమారుడైన బిర్జిస్ ఖదిర్ పేరిట ఒక చారిత్రాత్మక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో స్వదేశీయుల పట్ల, స్వదేశీ సంస్థానాధీశుల పట్ల, స్వదేశీయుల మత విశ్వాసాల పట్ల ఆంగ్లేయులు ఎంత మోసపూరితంగా. ప్రవర్తిస్తున్నారో ప్రశ్నిస్తూ విక్టోరియా ప్రకటనకు దీటుగా తాను 1858 డిసెంబరు 31న ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ చారిత్మ్రాక ప్రకటన పూర్తి పాఠం ఆంగ్లంలో ఉంది.