బేగం హజ్రత్ మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేగం హజ్రత్ మహల్
బేగం హజ్రత్ మహల్
జననం1820
ఫైజాబాద్, అవధ్
మరణంఏప్రిల్ 7, 1879 (59 సం.)
ఖాట్మండు, నేపాల్
భర్తవాజిద్ అలీ షా
మతంషియా ఇస్లాం

బేగం హజ్రత్ మహల్ (1820 - ఏప్రిల్ 7, 1879) నవాబ్ వాజిద్ అలీ షా యొక్క రెండవ భార్య. బేగం హజ్రత్ మహల్ ను వాజిద్ అలీ షా తన రాజభవనంలో కలుసుకున్నాడు. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి, భారత స్వాతంత్ర్యోద్యమములో కీలకపాత్ర వహించింది. బ్రిటీషు పాలకులు లక్నోని స్వాధీనం చేసుకున్నప్పుడు వాజిద్ అలీ షా వెళ్ళిపోవడంతో ఈవిడ అవధ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు స్వీకరించింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

మహల్ యొక్క అసలు పేరు మహమ్మది ఖనుమ్, ఈవిడ భారతదేశం, అవధ్ లోని ఫైజాబాద్ లో జన్మించింది. ఈవిడని తల్లిదండ్రులు ఒక ఏజెంట్ ద్వారా అవివాద్ రాజుకు అమ్మివేయడంతో అక్కడ మహాఖిరిగా పిలవబడింది.[2][3] ఆవాద్ రాజు ఈవిడను భార్యగా అంగీకరించాడు, [4] వారికి బిర్జిస్ ఖాదర్ (కుమారుడు) పుట్టిన తరువాత హజ్రత్ మహల్ గా మార్చబడింది.

హజ్రత్ మహల్ తజ్దార్-ఎ-అవిధ్ కు చివరి రాజైన వాజిద్ అలీ షా యొక్క చిన్న[5] భార్య. 1856లో బ్రిటిష్ వారు ఆవాద్ ను స్వాధీనం చేసుకోవడంతోపాటు వాజిద్ అలీ షాను కలకత్తాకు బహిష్కరించారు. అప్పటికే నవాబ్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ అవధ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు స్వీకరించింది.[6] అవధ్ ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద భాగం.

1857నాటి భారతీయ తిరుగుబాటు

[మార్చు]

1857 నుండి 1858 మధ్యకాలంలో జరిగిన భారతీయ తిరుగుబాటులో రాజా జైలాల్ సింగ్ నాయకత్వంలోని బేగం హజ్రత్ మహల్ సైన్యం బ్రిటిష్ దళాలపై తిరుగుబాటు చేసింది. లక్నోను స్వాధీనం చేసుకున్న తరువాత హజ్రత్ మహల్ తన కుమారుడైన బిర్జిస్ ఖద్రను అవధ్ యొక్క పాలకుడుగా ప్రకటించింది.[2][7]

మరణం

[మార్చు]

ఆమె అంతిమదశలో నేపాల్కు చేరుకుంది. అక్కడ ఆమెకు ఆశ్రయం కలిపించడానికి రాన దేశ ప్రధానమంత్రి జాంగ్ బహదూర్ నిరాకరించాడు.[8] చివరకు అనుమతి లభించింది.[9] ఆవిడ అక్కడ 1879లో మరణించింది. ఖాట్మండు జమా మసీదులోని పేరులేని సమాధిలో ఖననం చేయబడింది.[10] ఆమె మరణం తరువాత విక్టోరియా మహారాణి (1887) యొక్క జూబ్లీ సందర్భంగా, బ్రిటీష్ ప్రభుత్వం బిర్జిస్ ఖాదర్ ను క్షమించి, ఇంటికి తిరిగి రావడానికి అనుమతిని ఇచ్చింది.[11]

ఖాట్మండు జామా మసీదులోని బేగం హజ్రత్ మహల్ సమాధి
లక్నోలోని హజ్రత్ మహల్ పార్కు

స్మారకాలు

[మార్చు]
  1. ఖాట్మండు యొక్క కేంద్ర భాగమైన ఘంటాఘర్ సమీపంలోని జామా మసీదులో బేగం హజ్రత్ మహల్ సమాధి నిర్మించబడింది. ఇది జమా మసీదు కేంద్ర కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది.[12]
  2. 1857 తిరుగుబాటు ఉద్యమంలో కీలకపాత్ర వహించినందుకు 1962, ఆగస్టు 15న లక్నోలోని హజ్రత్ గంజ్ లోని ఓల్డ్ విక్టోరియా పార్కులో గౌరవించారు.[13][14][15] ఈ పార్కుకు హజ్రత్ మహల్ పార్కుగా పేరు మార్చడంతో పాటు, నాలుగు రౌండ్ ఇత్తడి ఫలకాలతో, అవధ్ రాజ కుటుంబం యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ తో ఒక పాలరాయి స్మారకం నిర్మించబడింది. దసరా పండగ సందర్భంగా లక్నోలో ఉత్సవాలు జాతరలు జరిగే సయమంలో రామ్‌లీలా ప్రదర్శనకు ఈ పార్కులోని వివిధ నిర్మాణాలను ఉపయోగిస్తుంటారు.[16]
  3. 1984 మే 10న భారత ప్రభుత్వం మహల్ గౌరవార్థం స్మారక తపాలా బిళ్ళను జారీ చేసింది. మొదటిరోజు సి.ఆర్. పాక్రశి చేత రూపొందించబడి, ఆకా శర్మ చేత రద్దు చేయబడింది. 15,00,000 స్టాంపులు జారీ చేయబడ్డాయి.[13][17]
  4. భారతదేశంలోని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతదేశంలో మైనారిటీ వర్గాలకు చెందిన విద్యర్థినుల కోసం బేగం హజ్రత్ మహల్ జాతీయ ఉపకారవేతనాన్ని ప్రారంభించింది. ఈ ఉపకారవేతనం మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా అమలు చేయబడుతుంది.[18][19]

మూలాలు

[మార్చు]
  1. ప్రజాశక్తి (17 June 2018). "వీర వ‌నిత‌లు వెలుగు దివ్వె‌లు". Archived from the original on 14 August 2018. Retrieved 14 August 2018.
  2. 2.0 2.1 Michael Edwardes (1975) Red Year. London: Sphere Books; p. 104
  3. Buyers, Christopher. "Oudh (Awadh) Genealogy". The Royal Ark.
  4. Christopher Hibbert (1980) The Great Mutiny, Harmondsworth: Penguin; p. 371
  5. Saul David (2002) The Indian Mutiny, Viking; p. 185
  6. "Begum Hazrat Mahal". Mapsofindia.com. Retrieved 18 October 2012.
  7. Sakshi (15 August 2020). "పరాయి పాలన నుంచి విముక్తికై." Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.
  8. Hibbert (1980); pp. 374–375
  9. Hibbert (1980); pp. 386–387
  10. Krishna, Sharmila (11 June 2002). "Far from the madding crowd she lies, forlorn & forgotten". The Indian Express - LUCKNOW. Retrieved 14 August 2018.
  11. Harcourt, E.S (2012). Lucknow the Last Phase of an Oriental Culture (seventh ed.). Delhi: Oxford University Press. p. 76. ISBN 0-19-563375-X.
  12. "A link to Indian freedom movement in Nepal". The Hindu. 8 April 2014.
  13. 13.0 13.1 "Little known, little remembered: Begum Hazrat Mahal". www.milligazette.com. Retrieved 20 August 2018.
  14. Ruggles, D. Fairchild. Woman's Eye, Woman's Hand: Making Art and Architecture in Modern India (in ఇంగ్లీష్). Zubaan. ISBN 9789383074785. Retrieved 20 August 2018.
  15. Yecurī, Sītārāma. The great revolt, a left appraisal (in ఇంగ్లీష్). People's Democracy. ISBN 9788190621809. Retrieved 20 August 2018.
  16. "Begum Hazrat Mahal in Lucknow | My India". Mapsofindia.com. Archived from the original on 31 మే 2014. Retrieved 20 August 2018.
  17. "Begum Hazrat Mahal". Indianpost.com. Retrieved 20 August 2018.
  18. https://web.archive.org/web/20180601144816/http://www.tribuneindia.com/news/jobs-careers/begum-hazrat-mahal-national-scholarship/483656.html
  19. http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=158165