1857 తిరుగుబాటు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Indian Rebellion of 1857

ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యాధికారానికి స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం జరిగి సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి, అణచివేతకు గురైన, అత్యంత ప్రభావితులైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.

అంతేకాకుండా భారత సైన్యంలో కూడా ఒక వర్గం బ్రిటిష్‌పై వ్యతిరేక భావాన్ని చూపగలిగింది. ఏదేమైనా 1650 తర్వాత భారతదేశంలో పునాదులు పాతుకుపోయి, దేశమంతటా వ్యాపించిన ఈస్టిండియా కంపెనీ అధికార దాహానికి అడ్డుకట్ట వేసి, కంపెనీ పాలనకు స్వస్తి పలికిన చారిత్రక సంఘటన ఇది. 1857 మే 10న మీరట్‌లో మొదలై 1858 సెప్టెంబరు 20న ఢిల్లీలో ముగిసిన తిరుగుబాటుకు అనేక కారణాలు ఉన్నాయి.

తిరుగుబాటు స్వభావం[మార్చు]

వి.డి. సావర్కర్ 1909లో లండన్‌లో ప్రచురించిన "First War of Indian Independence" అనే పుస్తకం 1857 తిరుగుబాటు స్వరూప స్వభావాలను ప్రశ్నించింది. దీనిపై జాతీయ వాదులు, చరిత్రకారుల మధ్య చర్చలు మూడు అంశాల చుట్టూ పరిభ్రమించాయి. అవి 1) తిరుగుబాటు అనేది సిపాయిల ప్రతిఘటన (పితూరి). 2) అది జాతీయ పోరాటం లేదా స్వాతంత్య్రం యుద్ధం 3) అది జమీందార్ల అసంతృప్తి, వారి ప్రతిచర్య.

సిపాయిల పితూరి[మార్చు]

19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ చరిత్రకారులు, కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరి’గానే అభిప్రాయపడ్డారు. సిపాయిలు తరుచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్‌‌స, స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం ‘సిపాయిల పితూరి’గా వర్ణించారు. ఈ సంఘటన గురించి ‘పూర్తిగా దేశభక్తి లోపించింది, సరైన స్వదేశీ నాయకత్వం లేదు. మద్దతు లేదు’ అని జాన్, సీలే పేర్కొన్నారు.

1857 తిరుగుబాటు స్వరూపాన్ని T.R. Holnes అనే చరిత్రకారుడు ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ అని పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే భావం అనేక విమర్శలకు గురైంది. ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి మహమ్మదీయుల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.

20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును V.D. Savarkar. "A planned war of National Independence‘ అని పేర్కొన్నారు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం "Eighteen fifty Seven‘లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించారు. 1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు

ఈ తిరుగుబాటులో పాల్గొన్న సిపాయిల కంటే పాల్గొనని సిపాయిల సంఖ్య అధికం. ఏది ఏమైనా 1857 తిరుగుబాటును స్వాతంత్య్ర సమర యుద్ధమని చెప్పలేమన్న దానికే ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించారు. 1857 తిరుగుబాటు గురించి మార్క్సిస్టు వాదులు ‘కర్షక సైనికుల తిరుగుబాటు విదేశీయులైన, భూస్వామ్య సంకెళ్లపైన’ అని అన్నారు.

తిరుగుబాటుకు కారణాలు[మార్చు]

1857 తిరుగుబాటు వలస పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ విధానాలు, ఆర్థిక దోపిడి, పరిపాలనా సంస్కరణలు అన్నీ కలసి.. భారతదేశంలోని సంస్థానాలు, సిపాయిలు, జమీందారులు, కర్షకులు, వ్యాపారస్థులు, కళాకారులు, చేతివృత్తులవారు, పండితులు, మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి.

రాజకీయ కారణాలు[మార్చు]

1757 ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాదులుపడ్డాయి. ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధం, దాని ఫలితంగా కుదిరిన 1765 అలహాబాద్ సంధి బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ, పన్నులు వసూలు చేసే హక్కు కల్పించింది.

ఇదే సమయంలో రాబర్‌‌ట క్లైవ్ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ రాజులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 1798లో గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి వచ్చిన లార్‌‌డ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వెల్లస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు. హైదరాబాదు, మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ పాలన కింద తొత్తులయ్యాయి.

1848లో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి డల్హౌసీ సతారా (1848), శంబల్‌పూర్ (1849), బగ ల్ (1850), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపూర్ (1854) లను ఆక్రమించారు. 1856లో పరిపాలనా వైఫల్యం అనే నెపంతో అయోధ్యను ఆక్రమించి బ్రిటిషర్ల దృష్టిలో డల్హౌసీ మంచి పేరు సంపాదించాడు.

ఈ లోప భూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్‌ను అవమానించిడం, ఝాన్సీలో లక్ష్మీబాయిని అణగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి. రిచర్‌‌డ టెంపుల్ మాటల్లో .. ‘‘రాబర్‌‌ట క్లైవ్ భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని తయారు చేస్తే, దాన్ని వెల్లస్లీ ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు. కానీ డల్హౌసీ బ్రిటిష్‌ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు’’ అన్నాడు.

ఆర్థిక కారణాలు[మార్చు]

బ్రిటిషర్ల మార్కెటిజం, ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా 1857 తిరుగుబాటుకు కారణమయ్యాయి. వలస పాలనతో భారతీయ చేతివృత్తులు, కళాకారులు, కర్షకులు ఆర్థిక జీవనంపై ప్రభావం చూపింది. బ్రిటిష్ విధానాల వల్ల భారతీయ కుటీర పరిశ్రమలు, వ్యవసాయం తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. బ్రిటిష్ పాలనలో వివిధ గవర్నర్ జనరల్‌లు ప్రవేశపెట్టిన జమీందారి, మహల్వారీ, రైత్వారీ పద్ధతులతో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. 1813 చార్టర్ చట్టంతో బ్రిటిష్ నుంచి ఉత్పత్తులు భారత మార్కెట్‌లో వరదల్లా ప్రవహించాయి. భారతదేశం నుంచి ముడి సరుకులు లండన్‌కు ఎగుమతయ్యేవి. ఉత్పత్తులు ఎగుమతి చేసే భారత్ ముడిసరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది. చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు. భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది.

అప్పుడు బెంటిక్ ‘‘భారత భూభాగాలు, చేతి వృత్తుల వారి ఎముకలతో శ్వేత వర్ణమయ్యాయి’’ అని అన్నాడు. ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిష్ విధానాలు దెబ్బతీశాయి. రాజులు, రాకుమారులు ఇతర మంత్రులు, అధికారులు వారికి రావాల్సిన పెన్షన్‌ను నష్టపోయి, సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి. భూస్వామ్య వ్యవస్థ నశించింది. ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిపాయిలకు మద్దతు పలికారు.

సామాజిక, మత కారణాలు: ఈస్టిండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి, మత మార్పిడులకు ఆహ్వానం పలికింది. ఈ చట్టం భారతీయుల మతజీవనంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బలవంత మత మార్పిడులకు బహిరంగంగా ప్రోత్సహించారు.

ఇంగ్లిష్ విద్యావిధానం ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరైంది. ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. 1833 నుంచి హిందూ, ముస్లింలను బహిరంగంగా క్రైస్తవమతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సంప్రదాయాలు దెబ్బతిన్నాయి. భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు, లేదా మార్పు చేశారు. 1829లో సతీ నిషేధ చట్టం, 1846లో స్త్రీ శిశుహత్యా నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి. వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి.

సైనిక కారణాలు[మార్చు]

1853లో కార్‌‌లమార్‌‌క్స ‘బ్రిటిషర్లు భారతీయ సైనిక సహాయంతో రాజ్యాన్ని స్థాపించి, భారతదేశ సొమ్ముతోనే పాలన కొనసాగించార’ని పేర్కొన్నారు. 1856 నాటికి బ్రిటిష్ సైన్యంలో 2,32,234 మంది భారతీయ సిపాయిలున్నారు. కంపెనీ చట్టాలతో వీరు అవమానానికి గురయ్యారు. బ్రిటిష్ సైనికులతో సమాన వేతనాలు వీరికి అందలేదు. 1854-1856 మధ్య జరిగిన యుద్ధానికి భారతీయ సైనికులు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. సముద్రాన్ని దాటడాన్ని అప్పటి భారతీయ సమాజం అంగీకరించేది కాదు. దీన్ని బ్రిటిష్ సైన్యంలోని బ్రాహ్మణ సైనికులు వ్యతిరేకించారు.

లార్‌‌డ కానింగ్ 1856లో ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియుక్త చట్టం భారతీయ సైనికుల్లో అసంతృప్తి కలిగించింది. ముస్లింలు, సిక్కులు, ఇతర భారతీయ సైనికులు కూడా బ్రిటిషర్ల వలే ఉండాలనే చట్టం అమలు చేశారు.

తక్షణ కారణం[మార్చు]

డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్‌‌డ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లకు (Catridges) ఆవు కొవ్వు లేదా పందికొవ్వుతో పూత పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన కొవ్వును తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.

తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి[మార్చు]

మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది.

భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, చపాతీలు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు.

కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి అప్పటి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను భారత జాతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీలోని ఈ విజయంతో దేశంలో ఉత్తర, కేంద్ర ప్రాంతాలు; అవధ్, రోహిల్‌ఖండ్, పశ్చిమ బీహార్‌ల్లో తిరుగుబాట్లు చెలరేగాయి.

తిరుగుబాటు నాయకులు[మార్చు]

నానాసాహెబ్: కాన్పూర్‌లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండుపంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు. జూన్ 4న 2వ అశ్విక దళం, 1వ స్వదేశీ పదాతి దళం కాన్పూర్‌లో తిరుగుబాటు చేసి అనేకమంది బ్రిటిష్ అధికారులను చంపాయి. ఈ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించారు.

తండ్రి మరణం తర్వాత ఇతనికి రావాల్సిన పెన్షన్‌ను కంపెనీ నిలిపివేసి, పీష్వా పదవిని రద్దు చేసింది. నానాసాహెబ్ తిరుగుబాటుకు తాంతియాతోపే మద్దతు పలికాడు. అనేక అపజయాలు ఎదుర్కొన్న నానాసాహెబ్ నేపాల్ అడవులకు పారిపోయాడు. తాంతియాతోపే ఝాన్సీ వెళ్లి లక్ష్మీబాయితో చేతులు కలిపాడు.

రెండో బహదూర్‌షా: చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను 1857 తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా భారత సైనికులు ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ‘జాఫర్’ అనే కలంపేరుతో రచనలు చేశాడు.

తిరుగుబాటు సమయంలో భారతీయులను కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నించి, బ్రిటిషర్లకు దొరికిపోయాడు. 1862లో రంగూన్ జైల్లో మరణించాడు. షా చక్రవర్తిగా అనేక సంస్కరణలు కూడా చేశాడు. ఢిల్లీలో గోవధను నిషేధించాడు. అతని మరణం ముందు అతని గొప్పదనం చెప్పాలంటే ‘‘మొగలు చక్రవర్తి జాఫర్ భౌతికకాయాన్ని పూడ్చడానికి అతడు 2 గజాల భూమిని కూడా నిలుపుకోలేకపోయాడు’’.

ఝాన్సీ లక్ష్మీబాయి: లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమెను ఝాన్సీ రాజు గంగాధరరావుతో వివాహం చేశారు. భర్త మరణంతో దామోదరరావును దత్తపుత్రుడిగా తీసుకున్నారు. 1848లో డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. దీంతో జూన్ 4, 1857న ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి యుద్ధభూమిలో మరణించింది. ఈ తిరుగుబాటును సర్‌హ్యూగ్ రోజ్ అణచివేశాడు. ఆమెకు సహకరించిన తాంతియాతోపేను బ్రిటిషర్లు ఉరితీశారు. లక్ష్మీబాయి గురించి సర్‌హ్యూగ్‌రోజ్ ‘‘1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన, ధైర్యమైన నాయకురాలు’’ అని పొగిడాడు