Jump to content

బైబిల్ వ్యాసాలు

వికీపీడియా నుండి

ఆదికాండం

[మార్చు]

1.ఆదికాండం (ఆరంభాలు) పరిచయం పేరు: మూల భాషయైన హీబ్రూలో రాసిన పాత ఒడంబడిక గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు (దేవుడు వారికి తన వాక్కు ఇచ్చాడు గదా) సాధారణంగా ప్రతి పుస్తకంలో మొదటి వచనంలోని మొదటి ఒకటి లేక రెండు మాటలను ఆ పుస్తకం పేరుగా పిలుచుకునేవారు. హీబ్రూలో ఆదికాండంలోని మొదటి పదం “ఆదిలో” అని అర్థమిచ్చే పదం కాబట్టి యూదులు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. తరువాత కొన్ని శతాబ్దాలకు హీబ్రూ పండితులు పాత ఒడంబడిక గ్రంథాన్ని గ్రీకు భాషలో తర్జుమా చేసి ప్రతి పుస్తకానికి పేరు పెట్టారు. ఈ తర్జుమాను “సెప్టుయజింట్” అంటారు. చాలాకాలం తరువాత ఈ పేర్లు బైబిలు యొక్క లాటిన్ తర్జుమాలోకి వచ్చాయి. ఇంకా కొన్ని శతాబ్దాల తరువాత ఈ పేర్లను బైబిలు యొక్క ఇంగ్లీషు తర్జుమాలో వాడారు. ఈ విధంగానే ఈ పేర్లు తెలుగు బైబిల్లో కూడా వాడడం జరిగింది. అంతేగాని దేవుని ప్రేరేపణవల్ల ఈ పేర్లు రాలేదు. రచయిత: మోషే. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు మోషే రాశాడని యూదుల గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని దృఢపరచడానికి బైబిల్లోనే గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నిర్గమ 17:14; 24:4; 34:27; సంఖ్యా 33:2; ద్వితీ 31:19,24-26; యెహోషువ 1:8; 8:31; 1 రాజులు 2:3; లూకా 24:44; 1 కొరింతు 9:9 చూడండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ నమ్మకంతో ఏకీభవిస్తూ మోషే తనగురించి రాశాడని అన్నాడు. మత్తయి 19:8; యోహాను 5:46,47; 7:19 చూడండి. వ్రాసిన కాలం: బహుశా క్రీ.పూ. 1446-1406 మధ్యకాలంలో. ముఖ్యాంశం: ఆరంభాలు. ఇక్కడ ఉన్నది దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం గురించిన ఆరంభం, ప్రపంచ ప్రారంభం, మానవజాతి, పాపం, పాప విమోచనకోసం దేవుని పద్ధతి, వివిధ జాతుల ఆరంభాలు, దేవుడు తన వాక్కును అందించిన ఇస్రాయేల్ ప్రజల ఆరంభం. విషయసూచిక:

ఆకాశాలు భూమిని సృజించడం 1:1-31
సృష్టిని గురించిన మరింత సమాచారం 2:1-25
మనిషి పాపంలో పడడం, దాని ఫలితం 3:1-24
కయీను, హేబెలు 4:1-18
కయీను సంతతివాళ్ళ గుణము 4:19-24
మొదటి ప్రజల వంశావళి 5:1-32
నోవహు, ఓడ, జలప్రళయం 6:1 – 8:22
నోవహుతో దేవుని ఒడంబడిక 9:1-17
వివిధ దేశాల ప్రారంభం 9:18 – 10:32
బాబెలు గోపురం 11:1-9
మరిన్ని వంశావళులు 11:10-32
అబ్రాహాము దేవుని పిలుపును శిరసావహించడం 12:1-9
ఈజిప్ట్‌లో అబ్రాహాము 12:10-20
లోత్, అబ్రాహాము విడిపోవడం 13:1-18
అబ్రాహాము, లోత్‌ను రక్షించడం 14:1-17
అబ్రాహాము, మెల్కీసెదెకు 14:18-20
అబ్రాహాముకు దేవుని వాగ్దానాలు 15:1-19
ఇష్మాయేల్ పుట్టుక 16:1-15
సున్నతి సంస్కారం గురించిన ఆజ్ఞ 17:1-14
ఇస్సాకును గురించిన వాగ్దానం 17:15-19
అబ్రాహాము ముగ్గురు అతిధులు 18:1-15
అబ్రాహాము సొదొమ గురించి ప్రార్థించడం 18:16-33
సొదొమ నాశనం 19:1-29
లోత్, అతని కుమార్తెలు 19:30-38
అబ్రాహాము, అబీమెలెకు 20:1-18
ఇస్సాకు పుట్టుక, ఇష్మాయేల్ వీడ్కోలు 21:1-21
ఇస్సాకు గురించి దేవుడు అబ్రాహామును పరీక్షించడం 22:1-19
శారా మరణం, భూస్థాపన 23:1-20
ఇస్సాకుకోసం పెళ్ళి కూతురు 24:1-67
అబ్రాహాము చనిపోవడం 25:1-11
ఇష్మాయేల్ సంతానం 25:12-18
యాకోబు, ఏశావుల పుట్టుక 25:19-26
ఏశావు తనజన్మహక్కును యాకోబుకు అమ్మడం 25:27-34
ఇస్సాకు, అబీమెలెకు 26:1-33
యాకోబు ఇస్సాకును మోసంచేసి అతని దీవెనలు పొందడం 27:1-29
ఏశావుకు నష్టం, అతని కోపం 27:30-45 యాకోబు లాబాను దగ్గరకు పారిపోవడం 28:1-22
యాకోబుకు వచ్చిన నిచ్చెన కల 28:10-22
యాకోబు భార్యలూ, పిల్లలూ 29:1 – 30:24
యాకోబు, లాబాను – ఇద్దరు మోసగాళ్ళు 30:25-43
యాకోబు పలాయనం, లాబాను వెంటబడడం 31:1-55
యాకోబు ఏశావును కలుసుకోవడానికి సిద్ధపడడం 32:1-21
యాకోబు దేవదూతతో పెనుగులాడడం 32:22-32
యాకోబు ఏశావుల కలయిక 33:1-17
షెకెంలో యాకోబు 34:1-31
బేతేల్‌లో యాకోబు 35:1-15
ఇస్సాకు, రాహేలుల మరణం 35:16-29
ఏశావు వంశావళి 36:1-43
యోసేపు కలలు 37:1-11
యోసేపు సోదరులు, అతణ్ణి అమ్మడం 37:12-36
యూదా, తామారు 38:1-30
ఈజిప్ట్‌లో యోసేపు – ఫోతీఫరు భార్య 39:1-19
చెరసాలలో యోసేపు, కలలభావం చెప్పడం 39:20 – 40:23
ఫరో కలలకు యోసేపు భావం చెప్పడం 41:1-38
యోసేపు ఈజిప్ట్ ప్రధానమంత్రి 41:39-57
యోసేపు, అతని సోదరులు 42:1 – 44:34
యోసేపు తనను తాను తెలియపర్చుకోవడం 45:1-15
యోసేపు సోదరులు యాకోబును ఈజిప్ట్‌కు తీసుకురావడం 45:16 – 46:34
యాకోబు ఫరోను కలుసుకోవడం 47:1-12
ప్రధానమంత్రిగా యోసేపు చర్యలు 47:13-31
యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించడం 48:1-22
యాకోబు తన స్వంత కుమారులను ఆశీర్వదించడం 49:1-28
యాకోబు మరణం 49:29-33
ఈజిప్ట్‌లో యోసేపు చివరి రోజులు 50:1-26

నిర్గమకాండం

2.నిర్గమకాండం (దాస్యవిముక్తి)

[మార్చు]

పరిచయం పేరు:

యూదులు ఈ పుస్తకాన్ని మొట్టమొదటి వచనంలోని పదాలయిన “...పేర్లు ఇవి” అని పిలిచేవారు (హీబ్రూలో ఇవి మొదటి రెండు మాటలు). తరువాత దీన్ని “పేర్లు” అని చిన్నగా చేశారు. ఆదికాండంలోని “పరిచయం” చూడండి. పాత తెలుగు బైబిలు (అంటే పరిశుద్ధగ్రంథం) లోని పుస్తకాల పేర్లన్నీ ఇతర భాషల్లోని బైబిళ్ళనుంచి తర్జుమా చేశారేగాని మూలభాష అయిన హీబ్రూ నుంచి కాదు. ఇక్కడ “నిర్గమకాండం” అనేకంటే దాస్యవిముక్తి అనడమే బాగుంటుందనిపిస్తుంది. రచయిత, వ్రాసిన కాలం: ఆదికాండం పరిచయం చూడండి. ముఖ్యాంశం: ఇస్రాయేల్‌ప్రజలకు దాసత్వంనుంచి విడుదల కలగడం అనేది మొదటి భాగం యొక్క ముఖ్యాంశం. దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి? ఎలా ఆరాధించాలి? అన్నది రెండవ భాగం ముఖ్యాంశం. ఈ పుస్తకమంతా ఆధ్యాత్మికమైన, సాదృశ్యమైన అర్థాలతో కూడి ఉండి నేటి విశ్వాసులకోసం కూడా మంచి ఉపదేశాలతో పాఠాలతో నిండివున్నది. విషయసూచిక

ఈజిప్ట్‌లోని దాసత్వం 1:1-22
మోషే పుట్టుక, బాల్యం 2:1-10
మోషే మిద్యానుకు పలాయనం, 40 సంవత్సరాలపాటు అక్కడే ఉండిపోవడం 2:11-24
మండుతున్న పొద దగ్గర దేవుడు మోషేను పిలిచి
అతన్ని ఈజిప్ట్‌కు పంపడం 3:1 – 4:17
మోషే అభ్యంతరాలు 3:11-13
దేవుడు తన పేరును ప్రకటించడం 3:14,15
మోషే మళ్ళీ అభ్యంతరం చెప్పడం, దేవుడు
అతనికి అద్భుతమైన శక్తులు ఇవ్వడం 4:1-9
మోషే మూడవ అభ్యంతరం 4:10-12
ఇంకెవరినైనా పంపమని మోషే దేవుణ్ణి అడగడం 4:13-17
మోషే ఈజిప్ట్‌కు తిరిగి రావడం 4:18-31
అహరోను, మోషే ఫరో దగ్గరకు వెళ్ళడం 5:1-21
దాస్య విముక్తి కలిగిస్తానని దేవుని వాగ్దానం 5:22 – 6:12
అహరోను చేతికర్ర పాముగా మారడం 7:9-13
ఈజిప్ట్‌పై దేవుడు పంపిన విపత్తులు 7:14 – 12:30
నీరు రక్తంగా మారడం 7:14-24
కప్పలు 7:25 – 8:15
దోమలు 8:16-19
ఈగలు 8:20-32
పశువుల చావు 9:1-7
కురుపులు 9:8-12
వడగండ్లు 9:13-35
మిడతలు 10:1-20
చీకటి 10:21-24
మొదట పుట్టిన సంతానం చావడం 11:1 – 12:30
పస్కా పండుగ 12:1-28
ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌ను విడిచి వెళ్ళడం 12:31-42
పస్కా పండుగ గురించి ఆదేశాలు 12:43-50
మొదటి సంతానాన్ని గురించి ఆదేశాలు 13:1-16
మేఘం, అగ్ని స్తంభాలు 13:20-22
ఇస్రాయేల్‌ప్రజలు ఎర్ర సముద్రం దాటడం, ఫరో సైన్యాలు అందులో మునిగిపోవడం 14:1-31
విముక్తి పాట 15:1-21
మారా ఏలీంల నీళ్ళు 15:22-27
దేవుడు మన్నాను, పూరేడు పిట్టలను ఆహారంగా ఇవ్వడం 16:1-36
దేవుడు బండరాయి నుంచి నీరు ఇవ్వడం 17:1-7
అమాలేకుతో యుద్ధం 17:8-15
మోషే మామగారు 18:1-27
సీనాయి పర్వతం మీద దేవుడు, ఇస్రాయేల్ ప్రజలు 19:1-25
ధర్మశాస్త్రంతో కూడిన ఒడంబడిక 19:5-8
పది ఆజ్ఞలు 20:1-17
మరిన్ని చట్టాలు, ఆదేశాలు 20:22 – 23:13
ఏటేటా జరిగే మూడు పండుగలు 23:14-17
ఇస్రాయేల్ ప్రజలకు దారి చూపడానికి దేవుని దూత 23:20-23
ఒడంబడికను స్థిరపరచడం 24:1-18
దేవుడు ఆరాధన గుడారం గురించి ఆదేశాలివ్వడం 25:1 – 31:18
పెట్టె 25:10-22
బల్ల 25:23-30
దీపస్తంభం 25:31-40
గుడారం 26:1-37
బలిపీఠం 27:1-8
ఆవరణం 27:9-19
నూనె 27:20,21
యాజుల వస్త్రాలు 28:1-43
యాజుల ప్రతిష్ఠ 29:1-45
ధూపవేదిక 30:1-10
ప్రాయశ్చిత్తం కోసం వెండి 30:11-16
కడగడానికి కంచు గంగాళం 30:17-21
అభిషేక తైలం 30:22-33
ధూపద్రవ్యం 30:34-38
కట్టేవాళ్ళు 31:1-11
విశ్రాంతి దినం 31:12-18
బంగారు దూడ 32:1-29
మోషే దేవునితో ప్రాధేయపడడం 32:30-34
సన్నిధి గుడారం 33:7-11
దేవుని మహిమను చూడాలనే మోషే విన్నపం 33:12-23
మోషే దేవుని మహిమను చూడడం, దేవుడు తన పేరును ప్రకటించడం 34:1-7
దేవుడు మరిన్ని ఆదేశాలు ఇవ్వడం 34:10-28
మోషే ముఖం ప్రకాశించడం 34:29-35
ఆరాధన గుడారం కట్టడానికి ప్రజలు తేవలసిన కానుకలు 35:4 – 36:7
ఆరాధన గుడారం నిర్మాణం 36:8 – 40:33
ఆరాధన గుడారం దేవుని మహిమతో నిండడం 40:34-38

3.లేవీయకాండం (యాజి ధర్మవిధులు)

[మార్చు]

పరిచయం పేరు:

యూదులు ఈ పుస్తకాన్ని మొదటి పదాలయిన “ఆయన పిలిచాడు” అనే పేరుతో పిలిచేవారు (హీబ్రూలో మొదటి పదం అదే). పాత తెలుగు బైబిలు (పరిశుద్ధ గ్రంథం) లో ఉన్న పేరు గ్రీకు తర్జుమాలో ఉన్న పేరు తర్జుమా. ఆ పేరు దేవుని ప్రేరేపణతో వచ్చినది కాదు. ఆదికాండం పరిచయం చూడండి. ఈ పుస్తకాన్ని లేవీయకాండం అనేదానికంటే “యాజి ధర్మవిధులు” అంటేనే బాగుంటుందనిపిస్తుంది. రచయిత వ్రాసిన కాలం: ఆదికాండం పరిచయం చూడండి. ముఖ్యాంశాలు: ఒక ముఖ్యాంశం జీవితంలోని ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన అవసరం. దేవుడు పవిత్రుడు. అలాగే ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి. 11:45; 19:2; 20:7 చూడండి. మరో ముఖ్యాంశం బలిద్వారానే దేవుణ్ణి సమీపించడం సాధ్యంగా ఉంది. 16:1-17 చూడండి. మనిషి పాపి గనుక ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అవసరం. ఈ పుస్తకమంతా సాదృశ్యాలతో, చిహ్నాలతో, సూచనలతో నిండి ఉంది. ఈ సాదృశ్యాలు క్రీస్తువైపు చూపిస్తూ మనుషులకు ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నవి. కొన్ని ముఖ్యమైన పదాలు: “బలి” “అర్పణ అర్పించడం” (నామవాచకం, క్రియాపదాలు దాదాపు 300 సార్లు ఉపయోగించడం జరిగింది). “శుద్ధ” “అశుద్ధ” (130 సార్లకంటే ఎక్కువసార్లు వాడబడ్డాయి), “పవిత్ర” (70 సార్లు వాడినది), “యాజి” లేక “యాజులు” (170 సార్ల కంటే ఎక్కువ వాడినది). యాజులు అంటే ప్రజల పక్షంగా, దేవుని సన్నిధిలో ప్రతినిధులుగా ఉన్నవారు, బలులు అర్పించేవారు, ఆరాధన గుడారంలోనూ ఆలయంలోనూ ఆరాధన విధులు నిర్వహించేవారు. విషయసూచిక

అయిదు ముఖ్యమైన బలులు లేక అర్పణలు 1:1 – 7:38
హోమబలి 1:1-17
నైవేద్యం 2:1-16
శాంతి బలి 3:1-17
పాపాలకోసం బలి 4:1 – 5:13
అపరాధ బలి 5:14 – 6:7
నిత్యహోమ బలి 6:8-13
వివిధ బలుల గురించి మరిన్ని ఆదేశాలు 6:14 – 7:38
యాజుల ప్రతిష్ఠ 8:1-36
యాజులు తమ పనిని ఆరంభించడం 9:1-24
నాదాబు, అబీహుల మరణం 10:1-7
యాజులకు ఆదేశాలు 10:8-20
శుద్ధమైనవి, అశుద్ధమైనవి 11:1 – 15:33
శుద్ధమైన, అశుద్ధమైన ఆహారాలు 11:1-47
పిల్లలను కన్న తరువాత శుద్ధపరచడం 12:1-8
వ్యాధులను గురించిన ఆదేశాలు 13:1-46
బూజును గురించిన ఆదేశాలు 13:47-59
చర్మ వ్యాధులనుండి శుద్ధపరచడం 14:1-32
బూజునుండి శుద్ధపరచడం 14:33-57
శరీర స్రావానికి సంబంధించిన ఆదేశాలు 15:1-33
మహా ప్రాయశ్చిత్త దినం 16:1-34
బలులు అర్పించే స్థలం 17:1-9
రక్తాన్ని తినడం నిషేధం 17:10-14
దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాలు 18:1-30
వేరు వేరు శాసనాలు, చట్టాలు 19:1 – 20:27
యాజుల పవిత్రత, వారి బాధ్యతలు 21:1 – 22:23
దేవుడు నియమించిన పవిత్ర కాలాలు లేక పండుగలు 23:1-44
విశ్రాంతి దినం 23:3
పస్కాపండుగ, పొంగని రొట్టెల పండుగ 23:4-8
మొదటి పంటలు 23:9-14
పెంతెకొస్తు పండుగ 23:15-22
బూరలూదే పండుగ 23:23-25
ప్రాయశ్చిత్తం 23:26-32
పర్ణశాలలు 23:33-44
రొట్టెలు, ఆలీవ్ నూనె నిత్యమూ దేవుని సన్నిధిలో ఉండాలి 24:1-9
దేవదూషణకు శిక్ష 24:10-23
విశ్రాంతి సంవత్సరం 25:1-7
మహోత్సవ సంవత్సరం (యాభైయో సంవత్సరం) 25:8-55
విధేయతకు ఆశీర్వచనాలు 26:1-12
అవిధేయతకు శాపాలు 26:13-46
వ్యక్తిగతమైన మరిన్ని ఆదేశాలు 27:1-34

ఇవి కూడా చూడండి

[మార్చు]