బైరిశెట్టి భాస్కరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైరిశెట్టి భాస్కరరావు (జనవరి 29, 1936 - డిసెంబరు 29, 2014) ప్రముఖ సినీ దర్శకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

1936, జనవరి 29 లో సికింద్రాబాద్‌లోని ఘాస్‌మండిలో కృష్ణయ్య, కమలమ్మ దంపతులకు జన్మించారు. భాస్కరరావు మహబూబ్‌కాలేజీలో ఎనిమిదవ తరగతి పూర్తిచేశారు.[1]

రాధ మై డార్లింగ్

సినిమా ప్రస్థానం

[మార్చు]

1959లో సినీ రంగప్రవేశం చేసిన ఆయన వి.మధుసూదనరావు, తాపీ చాణక్య, ఆదుర్తి సుబ్బారావు, భీమ్‌సింగ్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 40కిపైగా చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కృష్ణ, జమున హీరోహీరోయిన్లుగా రూపొందిన మనుషులు మట్టి బొమ్మలు (1974) చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన భాస్కరరావు తొలి చిత్రంతోనే ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో చక్కటి గుర్తింపును దక్కించుకున్న ఆయన కృష్ణ, కృష్టంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ లాంటి అగ్రనటీనటులతో 18 సినిమాల్ని రూపొందించారు. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, శ్రీవారు, కుంకుమతిలకం, చల్ మోహనరంగ, రాధ మై డార్లింగ్, చదరంగం, కళ్యాణ తిలకం, సర్ధార్ ధర్మన్న, అగ్గిరాజు, గృహలక్ష్మి, ఆస్తులు అంతస్తులు, శ్రీవారు, శ్రీరామచంద్రులు, సక్కనోడు, ఉమ్మడి మొగుడు, మామకోడలు చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.

కెరీర్‌లో అత్యధికంగా కృష్ణంరాజు 5, జయసుధతో 7 చిత్రాల్ని తెరకెక్కించారాయన. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన భాస్కరరావు... 1995 నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భాస్కరరావుకు భార్య కల్యాణితో పాటు కుమారుడు శ్రీకాంత్‌ఫణి, కుమార్తె భావన ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయన 2014, డిసెంబరు 29 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. దర్శకుడు భాస్కరరావు కన్నుమూత[permanent dead link]
  2. "దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు మృతి !". Archived from the original on 2015-01-04. Retrieved 2015-12-26.

ఇతర లింకులు

[మార్చు]