బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయం
బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°39′20″N 78°21′45″E / 17.6556°N 78.3626°E |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | సంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | బొంతపల్లి, గుమ్మడిదల మండలం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | అయ్యప్ప |
బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం. అయ్యప్ప భక్తులు కేరళలో శబరిగిరికొండకు వెళ్ళిన అనుభూతి కలిగేలా ఈ అయ్యప్పస్వామి దేవాలయం నిర్మించబడింది.[1]
దేవాలయ చరిత్ర
[మార్చు]1999లలో బొంతపల్లి గ్రామానికి చెందిన సురభి నాగేందర్‌గౌడ్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, కుమార్‌గౌడ్ తదితర వంటి భక్తులు కలిసి ఈ అయ్యప్పస్వామి దేవాలయాన్ని నిర్మించారు. శబరిగిరికొండలో వున్న అయ్యప్పస్వామి మూలవిరాట్టును పోలిన అయ్యప్పస్వామి విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఈ దేవాలయ ప్రాంగణంలో సాయిబాబా దేవాలయం, శరభలింగేశ్వరస్వామి దేవాలయం, నవగ్రహాలు, అభయాంజనేయ స్వామి దేవాలయం, బొంతపల్లి భద్రకాళీసమేత వీరభద్రస్వామి దేవాలయాలు ఉన్నాయి.[2]
ప్రత్యేకత
[మార్చు]అయ్యప్పస్వామి మండల దీక్షలు చేపట్టిన అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతిరోజూ పూజలు నిర్వహించి, అన్నదానం చేస్తారు.
దీక్షలు విరమణ
[మార్చు]బొంతపల్లి సమీప ప్రాంతాల నుండి అయ్యప్ప భక్తులు వచ్చి అయ్యప్పస్వామిని దర్శించుకొని, ఇరుముడులను సమర్పించి తమ దీక్షలను విరమిస్తుంటారు.
వార్షికోత్సవం
[మార్చు]ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో ఈ దేవాలయ వార్షికోత్సవం జరుపబడుతోంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా గణపతి హోమం, అష్టాభిషేకాలు, గౌరీపూజ, ఆభరణాల ఊరేగింపు, ఆరట్టు, మహిషి మర్ధనం, దివ్య మహాపడిపూజ వైభవంగా నిర్వహించబడుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ "శబరిగిరికొండను పోలిన వీరన్నగూడెం". www.msn.com. 2021-01-27. Archived from the original on 2021-12-15. Retrieved 2021-12-15.
- ↑ "రేపు అయ్యప్పస్వామి ఆలయ వార్షికోత్సవం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-13. Archived from the original on 2021-12-15. Retrieved 2021-12-15.