బొడ్డు బాల భాస్కర్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బొడ్డు బాల భాస్కర్, చైనాలో భారతదేశ ఉపరాయబారి.ఐ.ఎఫ్.ఎస్. అధికారి. నెల్లూరు జిల్లా సోమవరప్పాడు అనే కుగ్రామంలో జన్మించారు.నాన్న బొడ్డు మాలకొండయ్య, అమ్మ చిన్నమ్మ , అమ్మమ్మ గారి ఊరు కేశవరం గ్రామం (జలదంకి మండలం). ఆరుగురు అన్నదమ్ముల్లో అయిదవ వాడు. పెద్దన్న చంద్రయ్య పంచాయతీరాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. తమ్ముడు ఉదయ్‌భాస్కర్ నాబార్డ్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఇసుకలోనే అక్షరాభ్యాసం చేశారు. మూడవ తరగతి వరకు అంకెలు, పద్యాలు అన్నీ నోటి చదువే. తర్వాత ఉన్నత పాఠశాల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదువు ప్రకాశం జిల్లా కనిగిరిలో సాగింది. ఇంటర్ రెండవ సంవత్సరం మార్కాపురంలో చదివారు. వరంగల్ ఆర్.ఇ.సి.లో బీటెక్ సివిల్ చేసి ఉస్మానియాలో పి.హెచ్.డి. పట్టా తీసుకున్నారు.
గ్రామానికి చేయించిన పనులు
[మార్చు]- రోడ్డు,నీళ్ళ ట్యాంకు.
- కుట్టు, ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, గ్లాస్ పెయింటింగ్ శిక్షణ కార్యక్రమాలు
- చెరువుల అభివృద్ధి
భావాలు, అనుభవాలు
[మార్చు]- ప్రతిపూటా మనం భోజనం చేస్తాం. కాని ఆ భోజనం ఎలా వచ్చిందని ఎవరూ ఆలోచించం. ఆ ఒక్క విషయం ఆలోచిస్తే చాలు, అన్నదాతల కష్టసుఖాలు అందరికీ అర్థమవుతాయి.
- పల్లెలు విసిరేసినట్లు దూరంగా ఉంటాయి. కొన్నింటిని కలిపి ఒక దగ్గర చిన్నపాటి పట్టణాల్లా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అలా చేస్తే కనీస వసతులకు అయ్యే వ్యయం తగ్గుతుంది. అందరికీ వసతులు సమకూరే వీలుంటుంది. రైతులందరూ యంత్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆధునిక పద్ధతుల్లో సేద్యంచేస్తూ ఆర్థికంగా అనూహ్యమైన అభివృద్ధి సాధించాలి.
- సొంత ఊరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఊరికి ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు, మంచినీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించాడు. చెరువుల్ని అభివృద్ధి చేయించాడు.