Jump to content

బోగేశ్వరి ఫుకానాని

వికీపీడియా నుండి
బోగేశ్వరి ఫుకానాని
జననం
బోగేశ్వరి ఫుకానాని

1885
మరణంసెప్టెంబర్ 20, 1942
నాగాన్, అస్సాం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య ఉద్యమం యొక్క అమరవీరురాలిగా

బోగేశ్వరి ఫుకానాని (1885 - 1942 సెప్టెంబరు 20, 21) బ్రిటిష్ భారతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా భారత విమోచన ఉద్యమంలో ఒక కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు.[2]1947 లో భారతదేశం విముక్తి పొందిన తరువాత, ఒక ఆసుపత్రి , ఒక ఇండోర్ స్టేడియం బోగేశ్వరి ఫుకానాని పేరు మీద పెట్టబడ్డాయి.

జీవిత గమనం

[మార్చు]

ఫుకనానీ 1885లో అస్సాంలోని నాగావ్ జిల్లాలోజన్మించింది. ఆమెకు భోగేశ్వర్ ఫుకాన్ తో వివాహం జరిగింది , ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు , ఆరుగురు కుమారులు ఉన్నారు. భోగేశ్వరి ఫుకనాని ఒక సాధారణ గృహిణి. ఆమె దేశం పట్ల ప్రేమ కారణంగా, '60 ఏళ్ల అమరవీరురాలు ' అనే బిరుదును పొందింది. ఆమె అనేక తిరుగుబాట్లకు నాయకత్వం వహించడమే కాకుండా, తన పిల్లలను కూడా అదే విధంగా ప్రోత్సహించింది.[3] క్విట్ ఇండియా ఉద్యమంలో ఫుకనానీ ముఖ్య పాత్ర పోషించింది. అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బెర్హంపూర్, బాబాజియా, బర్పుజియా ప్రాంతాల్లో ఫుకనానీ క్రియాశీలకంగా ఉండి భారత జాతీయ కాంగ్రెస్కు కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో సహాయపడింది. ఇంకా ఇతర మహిళలకు ఆమె ప్రేరణ ఇచ్చింది. 1926లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సదస్సు గౌహతి (అస్సాం)లోని పండూలో జరిగింది. ఆ కార్యక్రమంలో అవసరం అయిన దుస్తుల తయారీలో ఈ ప్రాంతంలోని మహిళా సంస్థలో చురుకుగా పాల్గొంది,1930లో ఫుకనానీ బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన చర్యగా అహింసాత్మక కవాతులో పాల్గొని పికెటింగ్ చేసినందుకు అరెస్టు చేసారు. ఫుకనానీ , ఆమె కుమారులు ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి) బెర్హాంపూర్ కార్యాలయాన్ని బ్రిటిష్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యమ సమయంలో ఐదుగురు యువకులను బ్రిటిష్ అధికారులు కాల్చి చంపారు ప్రజలు వారిని అమరవీరులుగా ప్రకటించారు. ఒక నిర్దిష్ట రోజున ప్రజలు "పంచవీర్ దివాస్" అంటే ఐదుగురు వీరనాయకుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. 1942 సెప్టెంబరులో, విప్లవకారులు తిరిగి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో మనవరాలు రత్నమాలతో పాటు భోగేశ్వరి ఫుకానానీ జనసమూహానికి నాయకత్వం వహించారు.

మరణం

[మార్చు]

బోగేశ్వరి మరణానికి సంబంధించి రెండు వాదనలు ఉన్నాయి. మొదటి వాదన ప్రకారం, 1942 సెప్టెంబరు 18న శాంతిసేన శిబిరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న కార్యక్రమాన్ని జరుపుకోవడానికి బర్హంపూర్ ప్రజలచే సమాజ ప్రార్థన, విందు ఏర్పాటు చేయబడింది. విందు పురోగతిలో ఉన్నప్పుడు, బ్రిటిష్ సైన్యం కెప్టెన్ ఫినిష్ కింద ఒక సైనిక దళాన్ని పంపింది. ఈ ప్రదేశం అకస్మాత్తుగా యుద్ధభూమిగా మారింది , వారు ఉద్దేశ్యాన్ని వివరించడానికి ప్రజలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వారి సభ, లాఠీలు, తుపాకులతో ప్రజలను వెంబడించి దాడి చేసింది. గ్రామస్తులు నినాదాలు చేయడం ప్రారంభించారు. నినాదాలు విన్న గ్రామంలోని మహిళా జనపదులు ఏదో ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్నారు. ప్రజలు శిబిర౦లో గుమిగూడారు. సమీప గ్రామాల మహిళలు వెంటనే గుంపులుగా, వారి త్రివర్ణ పతాకాన్ని చేబట్టి క్యాంప్ ఆవరణకు పరుగెత్తారు. ఇందులొ బోగేశ్వరి ఫుకానాని మనవరాలు రత్నబాల ఫుకాన్ అనే పన్నెండేళ్ల అమ్మాయి తన వంతు ప్రయత్నం చేసింది. బోగేశ్వరి , రత్నబాలతో పాటు, చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది ఇతర వ్యక్తులు భారత జాతీయ జెండాను తీసుకుని వందేమాతర నినాదాన్ని పఠించారు . నిరసనకారులు తమను అదుపులోకి తీసుకున్న పోలీసులకు వ్యతిరేకంగా పోరాడారు. భోగేశ్వరి తన మనుమరాలు రత్నబాల ప్రాణాలకు ప్రమాదం కలిగించడాన్ని, జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు కోపంతో, ఫుకనాని తన చేతిలోని జెండాను లాక్కొని, జెండా వెదురు కర్రతో అతని తలమీద కొట్టింది, ఆమె చర్యలకు ఆగ్రహించిన కెప్టెన్ ఫినిష్ తన రివాల్వర్ తీసి, కింద పడిపోయిన భోగేశ్వరి ఫుకానానిపై కాల్పులు జరిపాడు. ఆమె తీవ్ర గాయాలతో 1942 సెప్టెంబరు 20 న మరణించింది[4]. ఇంకొ వాదన ప్రకారం ఆమె మనవరాలు రత్నమాల, చేతుల నుండి బ్రిటిష్ వారు భారతీయ జెండాను లాక్కున్నప్పుడు, జెండా గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నించినప్పుడు భోగేశ్వరి ఫుకనాని నాగావ్‌లోని బర్హంపూర్‌లో కాల్చి చంపబడిందిఅనే వాదన ఉంది[5].

మూలాలు

[మార్చు]
  1. Bhogeswari Phukanani. Retrieved February 9, 2013.
  2. "Woman Freedom Martyrs of Assam". MyGov Blogs (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-22.
  3. "How Bhogeswari Phukanani died fighting the British officer who disrespected the Indian flag". InUth (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-09. Retrieved 2021-09-22.
  4. https://www.bibliomed.org/mnsfulltext/197/197-1606744340.pdf?1632289790[permanent dead link]
  5. "Nagaon in Focus! | Nagaon District | Government Of Assam, India". nagaon.gov.in. Archived from the original on 2021-04-15. Retrieved 2021-09-22.