బౌద్ధులపై అకృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సా.శ830-966 మధ్య వందలాది బౌద్ధ స్తూపాలను విహారాలను హిందువులు ధ్వంసం చేశారు. పుష్యమిత్ర సంగ అనే బ్రాహ్మణుడు అశోకుడు కట్టించిన 84,000 బౌద్ధ స్తూపాలను నాశనం చేశాడు.[1] అక్కడనుండి మగధలో బౌద్ధ కేంద్రాల ధ్వంసం చేయటం కొనసాగింది.వేలాదిమంది బౌద్ధబిక్షువులను కిరాతకంగా హిందువులు చంపారు. బౌద్ధులు చదివే మంత్రాలవల్ల తనకు నిద్రా బంగం అవుతుందనే నెపంతో జలాలుకరాజు తన రాజ్యపరిధిలోని బౌద్ధవిహారాలన్నిటినీ నాశనం చేశాడని కల్హణుని కావ్యమైన రాజతరంగిణిలో చెప్పబడింది.[2] కాశ్మీర్లో కిన్నర రాజు వేలాది బౌద్ధ విహారాలను కూలగొట్టి బౌద్ధులని బంధించాడు.[3] నాగార్జునకొండవద్ద ఆది శంకరాచార్యుడు బౌద్ధ విగ్రహాలను చిహ్నాలను ధ్వంసంచేశాడు. నాగార్జునకొండ వద్ద తవ్వకాలు జరిపిన Longhurst తన పుస్తకం Memoirs of the Archaelogical Survey of India No: 54 లో ఈ విషయాలు గ్రంథస్తం చేశాడు.[4] బౌద్ధులను నిర్మూలంగా చంపాలని ఉజ్జయిని రాజు సుద్ధవనన్ ను కుమరిల పురికొల్పుతాడు. మృచ్ఛకటికంలో శూద్రక రాజు బావమరిది ఉజ్జయినిలో బౌద్ధులను చంపిన ఘటనలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Romila Thaper, Ashoka and Decline of Mouryas, London, 1961, p 200
  2. Kalhana, Rajatharangini, 1:40
  3. Kalhana, Rajatharangini, 1:80
  4. Memoirs of the Archaelogical Survey of India No: 54, The Budhist Antiquties of Nagarjunakonda (Delhi, 1938, p.6.)