బ్రహ్మరుద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మరుద్రుడు
(1986 తెలుగు సినిమా)
Brahma Rudrulu.jpg
దర్శకత్వం కె.మురళిమోహనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
వెంకటేష్,
లక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
భాష తెలుగు

బ్రహ్మ రుద్రులు 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. దీనిని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించాడు. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వెంకటేష్, లక్ష్మి, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.[1]

కథ[మార్చు]

జస్టిస్ జగదీష్ చంద్ర ప్రసాద్ (అక్కినేని నాగేశ్వర రావు) నాయానికి పూజారి. ఒకసారి దుష్టుడైన రాజకీయ నాయకుడు బలగం బ్రహ్మాజీ (పరుచూరి గోపాల కృష్ణ) ఎన్నిక చెల్లదని అతడు తీర్పు ఇస్తాడు. దానిపై బ్రహ్మాజీ పగబట్టి, జగదీష్ చంద్ర ప్రసాద్ బావమరిది బలరామ్ (రంగనాథ్) పై హత్యా నేఅం మోపుతాడు. జగదీష్ చంద్ర ప్రసాద్ అతడీకి మరణ శిక్ష విధిస్తాడు. అక్కడ నుండి, అతని సోదరి కనక దుర్గ (సుమిత్రా) తన సోదరుడి పట్ల ద్వేషాన్ని పెంచుకుని నగరం విడిచి వెళ్లిపోతుంది. 25 సంవత్సరాల తరువాత, జగదీష్ చంద్ర ప్రసాద్ మేనల్లుడు సత్య ప్రసాద్ / సత్యం (వెంకటేష్) పై మళ్ళీ బ్రహ్మాజీయే నేరం మోపుతాడు. పోలీసుల నుండి తప్పించుకునేటప్పుడు, అదృష్టవశాత్తూ, అతను జగదీష్ చంద్ర ప్రసాద్ భార్య సుజాత (లక్ష్మి) ను రక్షిస్తాడు. ఆమె అతనికి ఆశ్రయం ఇస్తుంది. అతను వారి ప్రేమను, ఆప్యాయతను పొందుతాడు. సమాంతరంగా, గంగ (రజని) అనే ఒక పనిమనిషి అతన్ని ప్రేమిస్తుంది. పిల్లలు కలగలేదు కాబట్టి జగదీష్ చంద్ర ప్రసాద్ దంపతులు సత్యంను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. దత్తత తీసుకున్న వెంటనే, సత్యం ఒక అమాయక అమ్మాయి జ్యోతి (రంజని) ని చంపిన నేరస్థుడని తెలుసుకుంటాడు. జ్యోతి మరిడేశ్వర రావు (ప్రభాకర్ రెడ్డి) కుమార్తె. అతడు బ్రహ్మాజీకి భాగస్వామి. సత్యం అరెస్టవుతాడు, జగదీష్ చంద్ర ప్రసాద్ కలుసుకుని వాస్తవం తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. అప్పుడు సత్యం గతాన్ని వివరిస్తాడు.

సత్యం, జ్యోతి కళాశాలలో ప్రేమ పక్షులు. బలగం రాజు (బెనర్జీ) ఒక వంకర వ్యక్తి, బ్రహ్మాజీ అన్నయ్య కుమారుడు. జ్యోతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. సత్యం పట్ల ఎప్పుడూ అసూయతో ఉంటాడు. ఒక రోజు, గొడవలో, రాజు జ్యోతిని చంపి, సత్యంను కేసులో ఇరికిస్తాడు. ఇప్పుడు జగదీష్ చంద్ర ప్రసాద్ ప్లీడర్ కోటు ధరించి అతడి తరపున కోర్టులో వాదిస్తాడు. అతడు దాదాపు గెలుపు అంచుకు చేరతాడు. అతన్ని నిరోధించడానికి, బ్రహ్మాజీ సుజాతను చంపేస్తాడు. అయినప్పటికీ, అతను కోర్టుకు వెళ్ళి సత్యంను బెయిలు మీద బయటకు తెస్తాడు. ఈ సమయంలో, జగదీష్ చంద్ర ప్రసాద్ సత్యంతో పాటు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాబట్టి, వారు దుష్టులను ట్రాప్ చేసి సత్యం అమాయకత్వాన్ని నిరూపిస్తారు. చివరకు, జగదీష్ చంద్ర ప్రసాద్ బ్రహ్మాజీని చంపి, న్యాయవ్యవస్థకు లొంగిపోతాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. LEO ఆడియో కంపెనీ పాటలను విడుదల చేసింది.

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "బుగ్గ గిల్లుకో" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:30
2 "కోకా జారిపోథే" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:07
3 "ఓ జబిలి" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:32
4 "ఎమ్మా ఎమ్మా" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:13
5 "తాయిలాలో తాయిలాలో" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:28
6 "ఓ న్యాయ దేవత" ఎస్పీ బాలు 3:48

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Error on call to మూస:cite web: Parameters url and title must be specified