బ్రహ్మోస్ ఏరోస్పేస్
రకం | ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ |
---|---|
పరిశ్రమ | ఏరోస్పేస్ , డిఫెన్స్ |
స్థాపన | (ఫిబ్రవరి 12, 1998 | )
ప్రధాన కార్యాలయం | న్యూ ఢిల్లీ, భారతదేశం |
కీలక వ్యక్తులు | అతుల్ దినకర్ రాణే (CEO & మేనేజింగ్ డైరెక్టర్) |
ఉత్పత్తులు | క్రూజ్ క్షిపణులు |
Total assets | US$5 billion (2013) |
యజమానిs | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, ఇండియా , ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్‌ప్రైజ్, రష్యా |
వెబ్‌సైట్ | brahmos.com |
బ్రహ్మోస్ ఏరోస్పేస్ (ఆంగ్లం: BrahMos Aerospace) భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన NPO మషినోస్త్రోయేనియా సంయుక్తంగా భారత్‌లో ఏర్పరచిన కంపెనీ. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను తయారుచేసేందుకు ఈ సంస్థను ఏర్పరచారు. బ్రహ్మపుత్ర, మోస్క్వా నదుల పేర్ల నుండి బ్రహ్మోస్‌కు ఆ పేరు వచ్చింది.
ఈ కంపెనీ ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణిలను తయారుచేస్తోంది. ఈ క్షిపణి పరిధి 300 కి.మీ. ఇది మ్యాక్ 2.8 నుండి మ్యాక్ 3.0 వేగం ప్రయాణిస్తుంది. కంపెనీ ప్రస్తుతం బ్రహ్మోస్-2 హైపర్‌సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది.
2016 లో భారత్ MTCR లో సభ్యత్వం తీసుకున్నాక, 600 కి.మీ. పరిధితో[1] లక్ష్యాలను కచ్చితంగా గురిచూసి ఛేదించగల కొత్త తరం బ్రహ్మోస్‌ను అభివృద్ధి చెయ్యాలని కంపెనీ భావిస్తోంది.[1][2]
చరిత్ర
[మార్చు]1990 ల నాటి గల్ఫ్ యుద్ధం తరువాత భారత్ తనకు ఒక క్రూయిజ్ క్షిపణి ఉండాలని భావించింది. ఫలితంగా 1998 లో అప్పటి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారు ఎ.పి.జె. అబ్దుల్ కలాం రష్యా డిప్యూటీ రక్షణ మంత్రితో మాస్కోలో ఈ విషయమై ఒక ఒప్పందం కుదురుకున్నారు.
ఈ కంపెనీలో భారత్ వాటా 50.5% కాగా, రష్యా వాటా 49.5%.
ఎదుగుదల
[మార్చు]బ్రహ్మోస్ ఏరోస్పేస్ మొదటి తయారీ కేంద్రం హైదరాబాదులో మొదలైంది. 2007 లో తిరువనంతపురంలోని కేరళ హైటెక్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసి, ఆ సంస్థను బ్రహ్మోస్ ఏరోస్పేస్ ట్రివేండ్రం లిమిటెడ్‌గా మార్చింది.[3] ఇది కంపెనీ యొక్క రెండవ క్షిపణి తయారీ కేంద్రంగా మారింది. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేసారు.[4][5]
ప్రస్తుతం నాగపూరులో మూడవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆలోచిస్తోంది.[6]
ధ్యేయం
[మార్చు]ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను రూపొందించి, అభివృద్ధి చేసి, తయారు చేసి, బహిరంగ విపణిలో అమ్మాలనేది సంస్థ లక్ష్యం.
సంస్థ ఆకృతి, నాయకత్వం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "MTCR benefit: India, Russia to develop 600-km range cruise missiles that can cover entire Pakistan". The Economic Times. Retrieved 19 October 2016.
- ↑ "BrahMos missile with higher range: This 'killer' India-Russia project will scare Pakistan and China". The Financial Express (India). Retrieved 19 October 2016.
- ↑ "About BrahMos Aerospace Trivandrum Limited". BrahMos Aerospace Trivandrum Limited. Archived from the original on 2 ఆగస్టు 2013. Retrieved 4 December 2013.
- ↑ "Missile man of India Sivathanu Pillai describes BrahMos plans". The Hindu. 31 December 2007. Retrieved 28 February 2012.
- ↑ "BrahMos takes over KELTEC". The Hindu. 6 December 2007. Retrieved 28 February 2012.
- ↑ "3rd BrahMos centre in Nagpur". Deccan Chronicle. July 6, 2012. Archived from the original on 2012-07-06. Retrieved July 8, 2012.