బ్రియాన్ మెక్‌మిలన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రియాన్ మెర్విన్ మెక్‌మిలన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెల్కమ్, దక్షిణాఫ్రికా | 1963 డిసెంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 189 cమీ. (6 అ. 2 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1984/85–1988/89 | Transvaal | |||||||||||||||||||||||||||||||||||||||
1986 | Warwickshire | |||||||||||||||||||||||||||||||||||||||
1989/90–1999/00 | Western Province | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2006 25 January |
బ్రియాన్ మెర్విన్ మెక్‌మిలన్ (జననం 1963, డిసెంబరు 22) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1991 నుండి 1998 వరకు 38 టెస్ట్ మ్యాచ్‌లు, 78 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 1990ల మధ్యలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా రేట్ చేయబడ్డాడు. 1991, 1996లో దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు.
మెక్‌మిలన్ కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా, కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. ఒక ప్రముఖ స్లిప్ ఫీల్డర్ కూడా, దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఔట్ ఫీల్డర్ కోసం ఒక టెస్టులో అత్యధిక శాతం క్యాచ్‌లను కలిగి ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]1992 నవంబరులో డర్బన్‌లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 20 ఏళ్ళ తర్వాత దక్షిణాఫ్రికా మొదటి హోమ్ టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 1991లో ప్రపంచ క్రికెట్‌లోకి తిరిగి ప్రవేశించిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 1991 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా తన వన్డే క్రికెట్ అరంగేట్రం చేశాడు.[1]
దేశీయ క్రికెట్
[మార్చు]దేశీయ క్రికెట్‌లో, 1984-85 నుండి 1988-89 వరకు నాలుగు సీజన్‌లకు ట్రాన్స్‌వాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1989-90 నుండి 1999-00 సీజన్‌లో రిటైర్మెంట్ వరకు వెస్ట్రన్ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1986లో వార్విక్‌షైర్‌తో ఒక సీజన్‌ను కూడా గడిపాడు.
క్రికెట్ తరువాత
[మార్చు]మెక్‌మిలన్ డర్బన్ విశ్వవిద్యాలయంలో వృత్తిపరమైన ఉపాధ్యాయుడిగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం కేప్ టౌన్‌లో ఆఫీస్ ఆటోమేషన్ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- "McMillan ordered to make apology". The Irish Times.
- "South Africa: Cricketer Apologises For Racist Comment". Panafrican News Agency. Dakar. 26 February 1999. Retrieved 25 August 2022 – via AllAfrica.