Jump to content

బ్రూస్ మార్టిన్

వికీపీడియా నుండి
బ్రూస్ మార్టిన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రూస్ ఫిలిప్ మార్టిన్
పుట్టిన తేదీ (1980-04-25) 1980 ఏప్రిల్ 25 (వయసు 44)
వాంగరేయి, న్యూజీలాండ్
మారుపేరుబక్కో
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
బంధువులుడానా ఆండర్సన్ (కోడలు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 259)2013 6 March - England తో
చివరి టెస్టు2013 9 October - Bangladesh తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00–2009/10Northern Districts
2010/11–2013/14Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA T20
మ్యాచ్‌లు 5 131 82 37
చేసిన పరుగులు 74 2,626 490 105
బ్యాటింగు సగటు 14.80 19.16 12.56 10.50
100లు/50లు 0/0 2/8 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 41 114 37 19
వేసిన బంతులు 1,518 27,967 3,806 780
వికెట్లు 12 355 83 39
బౌలింగు సగటు 53.83 37.57 32.30 26.02
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 18 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2 0 0
అత్యుత్తమ బౌలింగు 5/133 7/33 4/28 3/15
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 46/0 24/0 7/0
మూలం: Cricinfo, 2017 12 May

బ్రూస్ ఫిలిప్ మార్టిన్ (జననం 1980, ఏప్రిల్ 25) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. దేశీయ స్థాయిలో స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్ తరపున, హాక్ కప్‌లో నార్త్‌ల్యాండ్ తరపున ఆడాడు. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్‌గా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా రాణించాడు.

ప్రారంభ జీవితం, వృత్తి

[మార్చు]

బ్రూస్ ఫిలిప్ మార్టిన్ 1980, ఏప్రిల్ 25న న్యూజీలాండ్ లోని వంగరేయ్‌లో జన్మించాడు. బే ఆఫ్ ఐలాండ్స్‌లోని కెరికేరిలో పాఠశాలలో చదివాడు.[1]

న్యూజీలాండ్ అండర్-19 జట్టు కోసం మార్టిన్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు, తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్‌లు ఆడాడు. 2004లో న్యూజీలాండ్ ఎ జట్టుకు, 2011లో ఆస్ట్రేలియాలో ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో ఎంపికయ్యాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

మార్టిన్ 1999/2000లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కోసం అత్యుత్తమ అరంగేట్రం సీజన్‌లో 37 వికెట్లు తీశాడు. దాంతో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ కోసం జట్టులోకి వచ్చాడు.[2] న్యూజీలాండ్ ఎ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 2003/04 సంవత్సరంలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2009/10 సీజన్ ముగిసే వరకు నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కోసం ఆడటం కొనసాగించాడు, ఆ తర్వాత ఆక్లాండ్‌కు వెళ్ళాడు. చివరగా 2013లో న్యూజీలాండ్ తరపున తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడాడు.[3] ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ పర్యటనలలో మరో రెండు టెస్టులు ఆడాడు. పేలవమైన ఆటతీరు తర్వాత తొలగించబడ్డాడు. 2013/14 సీజన్‌లో ఆక్లాండ్ తరపున చివరి మ్యాచ్‌లు ఆడాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Bruce Martin in Profile". Archived from the original on 14 May 2010.
  2. "Cricket: Test tyro gets the Cairns welcome" (in New Zealand English). 2000-06-30. ISSN 1170-0777. Retrieved 2020-01-02.
  3. "Martin makes his wait worth it". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2013-03-15. Retrieved 2020-01-02.
  4. "Test cricket to the wilderness for Bruce Martin". Stuff (in ఇంగ్లీష్). Retrieved 2020-01-02.

బాహ్య లింకులు

[మార్చు]