బ్లాక్ అండ్ వైట్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్లాక్ అండ్ వైట్ 2008 విడుదలైన తెలుగు సినిమా.[1]

కథా సారాంశం[మార్చు]

భరత్ (రాజీవ్ కనకాల) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. అతను అనాథగా పెరిగి స్వశక్తితో పైకొచ్చినవాడు మరియు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లాండ్‍మైన్ అటాక్ నుండి కొంతమంది పోలీసులను కాపాడి రాష్ట్రపతి ఇచ్చే సిటిజెన్ అవార్డుకి ఎన్నికవుతాడు. అతని ప్రాణస్నేహితుడు శీను, ఆఫీసు, పిల్లలు – ఇదే అతని ప్రపంచం. ఇక్కడ మొదలౌతుంది మన కథ. తర్వాత ఓ అమ్మాయి (సింధూ తులాని) ని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. ఈ సమయంలోనే అతనిపై ఎవరో దాడులు చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ అతను తప్పించుకుంటూ ఉంటాడు. ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇలా ఉండగా ఒకానొక పరిస్థితిలో భార్యని ఆశ్చర్యపరచడానికి ఇంట్లోకి దొంగలా దూరి ఇతన్ని దొంగగా భావించిన ఆమె చేతిలో గాయపడి ఆస్పత్రి పాలౌతాడు. అతను అక్కడ ఉన్న సమయంలోనే ఊరు శివార్లలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడకి ఎలా వచ్చిందో తెలీకపోయినా భరత్ కారు ఉంటుంది. ఇతన్ని అనుమానం మీద పోలీసులు అరెస్టు చేస్తారు. ఇక్కడ్నుంచి కథ – భరత్ అమాయకుడా? అమాయకంగా కనిపించే విలనా? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నలకి జవాబుగా సాగుతుంది కథ.

మూలాలు[మార్చు]

  1. "Black & White (2008)". నవతరంగం. మూలం నుండి 2015-03-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-03-04.

బయటి లంకెలు[మార్చు]