బ్లూస్టాక్స్
పరిశ్రమ | Virtualization, Mobile Software |
---|---|
స్థాపన | స్థాపన |
స్థాపకుడు | Rosen Sharma, Jay Vaishnav, Suman Saraf |
ప్రధాన కార్యాలయం | Campbell, California, United States |
ఉత్పత్తులు | App Player, GamePop |
దస్త్రం:Latest version of Blustack player as of September.jpg | |
ఆపరేటింగ్ సిస్టం | Windows XP or later; Mac OS X Mavericks or later |
---|---|
ప్లాట్ ఫాం | x86, x64 |
ఫైల్ పరిమాణం | 294MB |
అందుబాటులో ఉంది | 16 భాషలు |
రకం | Virtual machine, Android emulator |
లైసెన్సు | Freeware |
జాలస్థలి | www |
బ్లూస్టాక్స్ అనేది బ్లూస్టాక్స్ యాప్ ప్లేయర్, ఇతర క్లౌడ్ ఆధారిత క్రాస్ ప్లాట్ఫామ్ ఉత్పత్తులు ఉత్పత్తి చేసే ఒక అమెరికన్ టెక్ సంస్థ. బ్లూస్టాక్స్ యాప్ ప్లేయర్ అనేది విండోస్ పిసిలలో, మెకింటోష్ కంప్యూటర్లలో ఆండ్రాయిడ్ అప్లికేషన్లను చేతనం చేయుటకు రూపొందించబడింది. ఈ కంపెనీ జే వైష్ణవ్, సుమన్ సరాఫ్, రోసెన్ శర్మ (మెకాఫీ లోని పూర్వ సిటిఒ, క్లౌడ్.కామ్ యొక్క బోర్డు సభ్యుడు) లచే 2009 లో స్థాపించబడింది. ఇందులో పెట్టుబడిదారులుగా ఆండ్రీసెన్-హోరోవిట్జ్, రెడ్‌పాయింట్, శాంసంగ్, ఇంటెల్, క్వాల్కామ్, సిట్రిక్స్, రాడార్ పార్టనర్స్, ఇగ్నిషన్ పార్టనర్స్, AMD, ఇతరులు ఉన్నారు.[1] బ్లూస్టాక్స్ శర్మ యొక్క 8వ సంస్థ (శర్మ కంపెనీల యొక్క ఐదు గూగుల్, మైక్రోసాఫ్ట్, సిట్రిక్స్ ఎక్స్ 2, మెకాఫీ చే కొనుగోలుచేయ్యబడినాయి). బ్లూస్టాక్స్ బీటా వెర్షన్ 2014 జూన్ 7 న సవరించబడింది.
బ్లూస్టాక్స్ ను కంప్యూటరులో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వాట్స్‌యాప్ వంటి ఆండ్రాయిడ్ యాప్ లను ఉపయోగించుకోవచ్చు. ఈ బ్లూస్టాక్స్ యాప్ ప్లేయర్ ను నెట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించే పద్ధతిలో కొన్ని అదనపు సౌకర్యాలు లభిస్తాయి.
యాప్ ప్లేయర్
[మార్చు]ఈ కంపెనీ అధికారికంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని సిట్రిక్స్ సినర్జీ సమావేశంలో 2011 మే 25 న ప్రారంభించబడింది. సిట్రిక్స్ CEO మార్క్ టెంపుల్టన్ వేదికపై బ్లూస్టాక్స్ యొక్క ఒక ప్రారంభ వెర్షన్ను ప్రదర్శించాడు, సంస్థలో ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు ప్రకటించాడు. యాప్ ప్లేయర్ యొక్క పబ్లిక్ ఆల్ఫా వెర్షన్ 2011 అక్టోబరు 11 న ప్రారంభించబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Etherington, Darrell. "After 10M Downloads, Samsung Backs GamePop As BlueStacks Adds $13M In New Funding". TechCrunch. Retrieved 23 July 2014.
- ↑ Empson, Rip. "BlueStacks Releases App Player And Cloud Connect Service To Let You Run Android Apps On Your PC". TechCrunch. Retrieved 4 December 2011.