బక్కియరాజ్ కణ్ణన్
స్వరూపం
బక్కియరాజ్ కణ్ణన్ | |
---|---|
జననం | బక్కియరాజ్ కణ్ణన్ |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినీ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆశ [1] |
బక్కియరాజ్ కణ్ణన్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు. ఆయన తమిళంలో రెమో,[2] సుల్తాన్[3] చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
జననం& విద్యాభాస్యం
[మార్చు]బక్కియరాజ్ కణ్ణన్ తమిళనాడు రాష్ట్రం, వేలూరులోని రామనాథపురం గ్రామంలో కణ్ణన్, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు తిరువళంలో పూర్తి చేశాడు. చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. కణ్ణన్ 2007-2010 వరకు తారామణి ఫిలిం & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుండి డి.ఎఫ్.టెక్ పూర్తి చేశాడు.
సినిమా జీవితం
[మార్చు]బక్కియరాజ్ కణ్ణన్ సుందర్ .సి దగ్గర దర్శకత్వ శాఖలో చేరి ‘కలగలప్పు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అట్లీ దగ్గర ‘రాజా రాణి’కి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. 2016లో ‘రెమో’ సినిమాతో దర్శకుడిగా మారాడు. కార్తీ హీరోగా 2016లో సుల్తాన్ సినిమాకు దర్శకత్వం వహించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (26 October 2020). "Karthi's Sultan director Bakkiyaraj Kannan ties the knot - Times of India". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ The Hindu (27 August 2016). "People thought Sivakarthikeyan was Anushka's sister". The Hindu. Retrieved 8 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (29 March 2021). "లైన్ వినగానే ఓకే అన్నారు". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ Andhrajyothy (28 March 2021). "బాహుబలి ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు: 'సుల్తాన్' దర్శకుడు". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.