భగవద్గీత-దైవాసురసంపద్విభాగ యోగము
భగవద్గీత | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
గమనిక
- భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికిసోర్స్లో ఉంది.
- భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్లో ఉన్నది: భగవద్గీత (తెలుగు అనువాదము)
దైవాసురసంపద్విభాగ యోగము, భగవద్గీతలో పదహారవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.
దైవగుణాలు
[మార్చు]భయం లేకుండడం, నిర్మల మనసు, అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, దోషాలు ఎంచకుండడం, మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీతి పట్ల ఆశ లేకుండడం.
రాక్షసగుణాలు
[మార్చు]గర్వం, పొగరు, దురభిమానం, కోపం, పరుషత్వం, అవివేకం.
దైవగుణాలు మోక్షాన్ని, రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి. నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు. దైవ, రాక్షస స్వభావులని రెండు రకాలు. రాక్షసస్వభావం గురించి చెప్తాను. మంచీ చెడుల విచక్షణ, శుభ్రత, సత్యం, మంచి ఆచారం వీరిలో ఉండవు. ప్రపంచం మిథ్య అని, దేవుడు లేడని, స్త్రీ పురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు. వీరు లోకకంటకమైన పనులు చేస్తారు. కామం కలిగి దురభిమానం, డంభం, మదం, మూర్ఖ పట్టుదల కలిగి అపవిత్రంగా ఉంటారు. కామం, కోపాలకు బానిసలై, విషయవాంఛలే ముఖ్యంగా వాటి అనుభవం కోసం అక్రమ ధనార్జన చేస్తూ నిత్యం ఆశలలో చిక్కుకొని ఉంటారు.
"ఇది నాకు దొరికింది. దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను. నాకు ఇంత ఉంది, ఇంకా వస్తుంది. ఈ శత్రువును చంపాను. మిగిలిన శత్రువులందరినీ చంపుతాను. నేను సర్వాధికారిని. బలవంతుడిని, సుఖిని, ధనికుడిని. నాకెదురు లేదు. నాకు ఎవరూ సమానం కాదు. యాగలూ, దానాలూ చేస్తాను. నేనెప్పుడూ సంతోషినే" అని అనుకుంటూ కామం, భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు. ఆత్మస్తుతి, డబ్బు మదంతో శాస్త్రాన్ని వీడి పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు. అన్ని దుర్గుణాలు కలిగి అసూయతో అంతర్యామి నైన నన్ను తిరస్కరిస్తారు. వీరు తిరిగితిరిగి ఇలాంటి జన్మలే పొందుతారు. వీరు ఎన్నటికీ నన్ను చేరలేక అంతకంతకూ హీనజన్మలనే పొందుతుంటారు. కామం, కోపం, పిసినారితనం ఈ మూడూ నరకానికి తలుపులు. ఆత్మజ్ఞానమును నాశనం చేస్తాయి. కాబట్టి ఈ మూడింటినీ వదిలిపెట్టాలి. వీటిని వదిలిన వాడే తపస్సు, యాగం మొదలగు వాటి వలన ఆత్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతారు. వేదశాస్త్రాలను లక్ష్యపెట్టని వారికి శాంతి లేక మోక్షం లభించవు. కాబట్టి ఏ పనిచెయ్యాలి, చేయకూడదు అన్నదానికి వేదశాస్త్రాలే నీకు ప్రమాణం. వాటి ప్రకారమే నీ కర్మలను చెయ్యి.