Jump to content

భగీరథ్ ప్రసాద్

వికీపీడియా నుండి
భగీరథ్ ప్రసాద్

పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – మే 2019
ముందు అశోక్ అర్గల్
తరువాత సంధ్యా రే
నియోజకవర్గం భిండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-07-03) 1947 జూలై 3 (వయసు 77)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మెహ్రున్నీసా పర్వేజ్
సంతానం 4 (సిమల ప్రసాద్, ఐపీఎస్)[1]
నివాసం మసూరి, భింద్, మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ
వృత్తి ఐఏఎస్ అధికారి (రిటైర్డ్).
మూలం [1]

భగీరథ్ ప్రసాద్ (జననం 3 జూలై 1947) భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భిండ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

భగీరథ్ ప్రసాద్ ఐఏఎస్ అధికారిగా రిటైర్డ్ అయిన తరువాత రాజకీయాల పట్ల ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భిండ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ అర్గల్ పై 18,886 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయనకు 2014లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన మరుసటిరోజు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి,[3][4] 2014లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇమర్తి దేవిపై 1,59,961 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. DNA India (7 February 2024). "Meet IPS officer, daughter of IAS officer, who worked in Bollywood films, cracked UPSC exam in 1st attempt with AIR..." (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. The Times of India (4 June 2024). "DR. BHAGIRATH PRASAD : Bio, Political life". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  3. The Economic Times (9 March 2014). "Congress Lok Sabha nominee from Bhind Bhagirath Prasad joins BJP". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  4. India Today (9 March 2014). "A day after he gets Congress ticket from Bhind Lok Sabha seat Bhagirath Prasad joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.