భట్టు సత్యనారాయణ
భట్టు సత్యనారాయణ | |
---|---|
జననం | |
జాతీయత | భారతదేశం |
వృత్తి | కర్నాటక సెంట్రల్ వర్శిటీ వైస్‌చాన్సలర్ |
తల్లిదండ్రులు | లింగయ్య, రాజమ్మ |
భట్టు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆయన 2021, జులై 23న కర్నాటక సెంట్రల్ వర్శిటీ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో ఐదేండ్లు పాటు కొనసాగనున్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]భట్టు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా , వి.సైదాపూర్ మండలం , బొమ్మకల్ గ్రామంలో లింగయ్య, రాజమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఒకటవ తరగతి నుండి 5వ వరకు బొమ్మకల్, 6వ నుండి 10వ తరగతి వరకు కరీంనగర్ లో వూర్తి చేశాడు. ఆయన కరీంనగర్ లో ఇంటర్మీడియట్ , వరంగల్‌లోని ఎల్బీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.
వృత్తి జీవితం
[మార్చు]ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ ఇందిరా గాంధీ ఓపెన్ వర్సిటీలో అధ్యాపకులుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో 1989లో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిన ఆయన ఓయూలో రసాయన శాస్త్ర విభాగాధిపతిగా 30 సెప్టెంబర్ 2019న రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ (ఔటా) మూడు సార్లు అధ్యక్షుడిగా, ఓయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ , శాతవాహన వర్సిటీ ఫ్యాకల్టీ డీన్‌గా, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల టీచర్స్ సమాఖ్య ఛైర్మన్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[1]
వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు
[మార్చు]భట్టు సత్యనారాయణ 2021, జులై 23న కర్నాటక సెంట్రల్ వర్శిటీ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 September 2019). "అలుపెరగని 'అధ్యాపకుడు'!". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
- ↑ The New Indian Express (23 July 2021). "Central University of Karnataka gets new VC: Osmania University Chemistry prof Dr Battu Satyanarayana gets top post" (in ఇంగ్లీష్). Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
- ↑ Andrajyothy. "Central university వీసీలుగా తెలుగువారు". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
- ↑ The Hindu (23 July 2021). "Battu Satyanarayana appointed vice-chancellor of Central University of Karnataka" (in Indian English). Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.