Jump to content

భద్రకాళి చెరువు

వికీపీడియా నుండి
భద్రకాళి చెరువు
భద్రకాళి చెరువు, వరంగల్లు
ప్రదేశంవరంగల్లు, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°59′42″N 79°34′55″E / 17.9949°N 79.582°E / 17.9949; 79.582
రకంమానవ నిర్మితం
ప్రవహించే దేశాలు India
ఘనీభవనంకాదు
ప్రాంతాలువరంగల్లు

భద్రకాళి చెరువు తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉన్న చెరువు. భద్రకాళి దేవాలయంకు ఎదురుగా ఉన్న ఈ చెరువును కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించాడు. ఇది వరంగల్లు నగర ప్రజలకు తాగునీటిని అందిస్తుంది.[1]

భద్రకాళి చెరువు

చరిత్ర

[మార్చు]

రాజ్య ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చేందుకు కాకతీయ రాజు గణపతి దేవుడు కాలంలో ఈ చెరువు నిర్మించబడింది. ఈ చెరువుకు దిగువ మానేరు డ్యామ్ నుండి నీరు పంపింగ్‌ చేయబడుతుంది. అందువల్ల ఏడాది మొత్తం భద్రకాళి చెరువులో నీరు ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ చెరువుకున్న మట్టిచెరువు కట్టను అభివృద్ధిచేసి భద్రకాళి బండ్ నిర్మించి, బండ్‌పై ఆర్చీలను నిర్మించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండుందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా భద్రకాళి బండ్‌పై సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబడింది. గ్రీనరీ, పూలమొక్కలు, స్టోన్‌ రివిట్‌మెంట్‌, నాలుగు వైపులా ఆకట్టుకునే స్వాగత ద్వారాలు, ఓరుగల్లు ఘనచరిత్ర ఉట్టిపడేలా రాతి స్తంభాలు, అంతర్గత రోడ్లు, వాటర్‌ ఫౌంటెన్‌ నిర్మించబడ్డాయి.[2]

పర్యాటక ప్రాంతంగా

[మార్చు]

పెద్ద జియో-బయోడైవర్శిటీ కల్చరల్ పార్కుగా అభివృద్ధి చేయబడి, విహార ప్రదేశాలు, చారిత్రక గుహలు, వంతెనలు వంటివి నిర్మించబడ్డాయి.[3] హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకంలో భాగంగా చెరువుకట్టను సుందరీకరించి, మినీ ట్యాంక్‌బండ్‌లా మార్చారు.[4][5]

ఇతర వివరాలు

[మార్చు]
  • విజయదశమి రోజున భద్రకాళి చెరువులో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు[1] 2019, అక్టోబరు 9న విజయదశమి సందర్భంగా నిపుణులచే రూపొందించబడి విజయవాడ నుంచి వచ్చిన తెప్పోత్సవ పడవలో హంస వాహనంపై భద్రకాళీ భద్రేశ్వరులకు జలక్రీడోత్సవం, తెప్పోత్సవం నిర్వహించారు.[6]
  • ఈ చెరువులో సుమారు 1,300 ఏళ్ల నాటి అనగా కాకతీయుల కాలం కంటే పూర్వం నాటి గణపతి, శివలింగంతోపాటు మరికొన్ని శిల్పాలు బయల్పడ్డాయి. చెరువులో ఉన్న రెండు పెద్ద బండరాళ్లలో పైన ఉన్న బండరాయిపై వికసిత పద్మంలో కూర్చున్న ఐదు అడుగుల ఎత్తుతో ఉన్న వినాయకుడి విగ్రహం, కిందవున్న మరో బండరాయిపై శివలింగం, నంది, వినాయకుడు, సూర్యుడు, మహిషాసురమర్ధిని, విష్ణు శిల్పాలు ఉన్నాయి.[7][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 September 2019. Retrieved 22 January 2020.
  2. ఈనాడు, వరంగల్లు (14 August 2019). "భద్రకాళి బండ్‌ అపురూపం". www.eenadu.net. Archived from the original on 22 January 2020. Retrieved 22 January 2020.
  3. The Hindu, History & Culture (6 August 2015). "Destination Warangal". J.S. Ifthekhar. Archived from the original on 6 October 2019. Retrieved 22 January 2020.
  4. The Hindu, Telangana (28 March 2016). "Telangana to restore five water bodies". Archived from the original on 5 October 2019. Retrieved 22 January 2020.
  5. The Times of India, Hyderabad (14 October 2015). "Not Hyderabad, Warangal now tourism hotspot". Swathyr Iyer. Archived from the original on 5 November 2019. Retrieved 22 January 2020.
  6. ఆంధ్రజ్యోతి, వరంగల్లు (10 October 2019). "శోభాయమానంగా భద్రకాళి కల్యాణోత్సవం". Archived from the original on 22 January 2020. Retrieved 22 January 2020.
  7. సాక్షి, తెలంగాణ (4 May 2018). "భద్రకాళి చెరువులో గణపతి". Archived from the original on 15 May 2018. Retrieved 22 January 2020.
  8. మన తెలంగాణ, దునియా (25 May 2018). "భద్రకాళి చెరువులో చారిత్రక సంపద". Archived from the original on 19 November 2018. Retrieved 23 January 2020.