భరణి నక్షత్రము జాతకుల
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
శుక్రుడు అధిదేవతగా కలిగిన భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు ఇతరులను ఆకట్టుకునే ఛాయను కలిగి ఉంటారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ జాతకులు ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే నోటితో అంత కఠినంగా విమర్శిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
తాను నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వైఖరిలో మార్చుకోరు. దీనివల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అందుచేత ప్రతి నిత్యం భరణీ నక్షత్రములో పుట్టిన జాతకులు మహాలక్ష్మిదేవి పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారైనా ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు ధనంపట్ల, స్త్రీల పట్ల మోజు లేనట్లు నటిస్తారు. అలంకరణపై ఆసక్తి చూపే ఈ జాతకులకు భార్య వల్ల అదృష్టం కలిసివస్తుంది. వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సంతానంపై అధిక ప్రేమను కలిగి వుండే ఈ జాతకులు అనేక మందికి జీవనాభివృద్ధి కలిగిస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు సంపాదించుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9 అనే సంఖ్య అనుకూలిస్తుంది. ఇంకా 9, 18, 27, 36, 45, 54, 63, 72 అనే సంఖ్యలు కూడా శుభఫలితాలనిస్తాయి. అలాగే ఈ జాతకులకు ఎరుపు, తెలుపు రంగులు అదృష్టానిస్తాయి. ఇందులో ఎరుపు రంగు చేతిరుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.
ఇదేవిధంగా భరణి నక్షత్ర జాతకులకు కుజ గ్రహ ప్రభావం ఉండటంతో మంగళవారం వీరికి కలిసివస్తుంది. బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే గురువారం మాత్రం ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.