భలే దంపతులు
భలే దంపతులు (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
కథ | శ్రీనివాస చక్రవర్తి |
చిత్రానువాదం | కోడి రామకృష్ణ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు జయసుధ రాజేంద్ర ప్రసాద్ వాణీ విశ్వనాథ్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | తోటపల్లి మధు |
కూర్పు | నాగేశ్వరరావు సత్యనారాయణ |
నిర్మాణ సంస్థ | సాయి సుధా కంబైన్స్ |
భాష | తెలుగు |
భలే దంపతులు 1989 లో వచ్చిన కామెడీ చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, సాయి సుధా కంబైన్స్ బ్యానర్‌లో జి. సత్య ప్రతాప్, బి. సాయి శ్రీవివాస్ నిర్మించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, వని విశ్వనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. రాజ్ - కోటి సంగీతం సమకూర్చారు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.
కథ
[మార్చు]రాజా (రాజేంద్ర ప్రసాద్) నిరుద్యోగంతో బాధపడుతున్న ఒక యువకుడు, ఏదో ఒక రోజు విషయాలు బాగుపడతాయనే అతని ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతూంటుంది. అతను తన చుట్టుపక్కల ప్రజలకు భారంగా ఉండకపోవడమే ఉత్తమమనుకుని, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆనందరావు (అక్కినేని నాగేశ్వరరావు) ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, అతను రాజాను రక్షించి, జీవితంలో ఆశను కోల్పోనని వాగ్దానం చేస్తే తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటాడు.
రాజా ధనవంతుడైన వ్యాపారవేత్త నారాయణ స్వామి (కోట శ్రీనివాసరావు) కుమార్తె వాణి (వాణి విశ్వనాథ్) తో ప్రేమలో పడతాడు. మొదట్లో నారాయణ స్వామి వారి ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆనంద రావు నారాయణ స్వామిని ఒప్పిస్తాడు. రాజా, వాణీలు పెళ్ళి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కొన్నాళ్ళకు చిన్నచిన్న కలతలు రేగుతాయి. యువ జంట సంసారాన్ని కాపాడటానికి ఆనంద రావు, తననుండి దూరంగా ఉంటున్న భార్య సుధ (జయసుధ) ను తనతో సంతోషంగా జీవిస్తున్నట్లు నటించి, రాజా, వాణిల సంబంధాన్ని చక్కదిద్దడానికి సహాయం చేయమని అడుగుతాడు. రెండు జంటలూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని గ్రహించడం ప్రారంభిస్తారు.
నటవర్గం
[మార్చు]- ఆనంద్ రావుగా అక్కినేని నాగేశ్వరరావు
- రాజాగా రాజేంద్ర ప్రసాద్
- సుధ పాత్రలో జయసుధ
- వాణిగా వాణి విశ్వనాథ్
- గొల్లపూడి మారుతీరావు మహర్షిగా
- నారాయణ స్వామిగా కోట శ్రీనివాసరావు
- నూతన్ ప్రసాద్
- నాగేష్
- బ్రహ్మానందం
- మల్లికార్జున రావు
- దేవదాసు కనకళ
- సుశీలగా రోహిణి
- శ్రీలక్ష్మి
- చంద్రిక
సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: రామ్‌చంద్ర సింగ్
- నృత్యాలు: శివశంకర్, సుందరం
- స్టిల్స్: సబాస్టియన్ బ్రదర్స్
- సంభాషణలు: తోటపల్లి మధు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, | వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి
- సంగీతం: రాజ్-కోటి
- కథ: శ్రీనివాస చక్రవర్తి
- కూర్పు: నాగేశ్వరరావు, సత్యనారాయణ
- ఛాయాగ్రహణం: శరత్
- నిర్మాత: జి. సత్య ప్రతాప్, బి. సాయి శ్రీవివాస్
- చిత్రానువాదం - దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: సాయి సుధ కంబైన్స్
- విడుదల తేదీ: 1989 ఫిబ్రవరి 21
పాటలు
[మార్చు]ఎస్. | పాట పేరు | సాహిత్యం | గాయకులు | పొడవు |
---|---|---|---|---|
1 | "చూడరా దేశమేడున్నదో" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు | 4:24 |
2 | "గిల్లికజ్జాల బుల్లిబుజ్జాయి" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 3:48 |
3 | "చిలకమ్మకి నెల తప్పిందంట" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:08 |
4 | "తారలకీ జాబిలికీ" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 3:44 |
5 | "ఝాం తక్కెర జింగిరి మింగిరి" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 3:30 |