Jump to content

భాగవతుల దత్తగురు

వికీపీడియా నుండి
భాగవతుల దత్తగురు
ప్రొ. దత్తగురు
జననం1941
జాతీయతభారతీయుడు
విశ్వవిద్యాలయాలుఆంధ్ర విశ్వవిద్యాలయం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
వృత్తిఇంజనీరు, విద్యావేత్త

ప్రొఫెసర్ భాగవతుల దత్తగురు (జననం 1941) ఇంజనీరు, విద్యావేత్త. అతను 2005లో సైన్స్, ఇంజనీరింగ్ రంగంలో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారంతో సహా అనేక పురస్కారంలను అందుకున్నాడు.[1]

చదువు

[మార్చు]

దత్తగురు తన పాఠశాల విద్యను వివిధ బోర్డింగు పాఠశాలల్లో చదివాడు. అతని తండ్రి రాఘవేంద్ర శాస్త్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. అతనికి ఆంధ్రా లయోలా కళాశాలతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధం ఉంది. అక్కడ అతను 1955-57 లో ఇంటర్మీడియట్, 1957-59 లో B.Sc డిగ్రీ (భౌతికశాస్త్రం మెయిన్) చేసాడు. డిగ్రీలో అతను మొదటి స్థానంలో నిలిచి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సాధించాడు.

సైన్స్ పట్ల గొప్ప ఇష్టంతో దత్తగురు, ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చేరాడు. 1959-62లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో BE, 1962-64లో ఏరోస్పేస్ టెక్నాలజీలో ME చేశాడు.

ప్రొఫెసర్‌గా కెరీర్

[మార్చు]

డాక్టర్ దత్తగురు 1964 లో ఐఐఎస్‌సి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో అధ్యాపకుడుగా చేరాడు., 1973 లో పీహెచ్‌డీ పొందిన తర్వాత, అక్కడే అతను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 2004 జూన్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగానికి అధిపతిగా పదవీ విరమణ చేసాడు.

ఐఐఎస్‌సిలో ఉన్న సమయంలో, డాక్టర్ దత్తగురు రాష్ట్రపతి, APJ అబ్దుల్ కలాం, కోట హరినారాయణ, కస్తూరి రంగన్, R. చిదంబరంతో సహా అంతరిక్ష సాంకేతిక పరిశోధకులతో కలిసి పనిచేశాడు. అధ్యాపకుడుగా డా.దత్తగురు అనేకమంది పరిశోధకులకు మార్గదర్శకత్వం చేసాడు. అతను అమెరికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్ తదితర దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసాడు. పదవీ విరమణ తర్వాత డా. దత్తగురు, ఐఐఎస్‌సిలో ఎమెరిటస్ ప్రొఫెసర్ అయ్యాడు. అతను బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • ఛైర్మన్ (1999-2003), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఐఐఎస్‌సి
  • నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ యొక్క సీనియర్ రెసిడెంట్ రీసెర్చ్ అసోసియేట్, (అమెరికా) ఫెటీగ్ అండ్ ఫ్రాక్చర్ బ్రాంచ్ ఆఫ్ NASA లాంగ్లీ రీసెర్చ్ సెంటర్, హాంప్టన్, వర్జీనియా, అమెరికా (1980-1982)
  • ఛైర్మన్ (1996-2000), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ, ఐఐఎస్‌సి
  • కోఆర్డినేటర్ (1987–91), జాయింట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ప్రోగ్రామ్, ఐఐఎస్‌సి
  • కోఆర్డినేటర్ (1993-2000) ARDB స్ట్రక్చర్స్ ప్యానెల్ సభ్యుడు
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ మెటీరియల్స్, స్ట్రక్చర్స్ అండ్ సిస్టమ్స్ కి ప్రెసిడెంట్ (2001-2003)
  • ప్రెసిడెంట్ (2003–04), అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ సొసైటీ
  • RV-TIFAC కాంపోజిట్ డిజైన్ సెంటర్ పాలక మండలి సభ్యుడు,
  • వైస్ ప్రెసిడెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ మెటీరియల్స్, స్ట్రక్చర్స్ అండ్ సిస్టమ్స్ (ISSS).
  • సభ్యుడు(1985–93), కో-ఆర్డినేటర్ (1993-2000), ఏరోనాటిక్స్ R&D బోర్డ్, స్ట్రక్చర్స్ ప్యానెల్.
  • ఇండియన్ రిప్రజెంటేటివ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫ్రాక్చర్ (ICF) (1984–89).
  • అసోసియేట్ ఎడిటర్, జర్నల్ ఆఫ్ ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, 1988
  • ప్రొఫెసర్ GR ఇర్విన్ గౌరవార్థం ప్రచురించబడిన ఫ్రాక్చర్ మెకానిక్స్ జర్నల్ మూడు ప్రత్యేక సంచికలకు అతిథి సంపాదకుడు.
  • విఎస్‌ఎస్‌సి, త్రివేండ్రంలో.పిఎస్‌ఎల్‌వి ప్రోగ్రామ్‌లపై ఫ్రాక్చర్ కంట్రోల్ ప్లాన్ అభివృద్ధి కోసం నెలకొల్పిన వర్కింగ్ గ్రూప్ సభ్యుడు.
  • విఎస్‌ఎస్‌సి, త్రివేండ్రం, NAL, బెంగళూరు; ఐఐఎస్‌సి, బెంగళూరు లతో ఏర్పాటు చేసిన ప్రెజర్ వెసెల్స్/రాకెట్ మోటార్ కేసింగ్‌ల రూపకల్పనలో ఫ్రాక్చర్ క్రైటీరియన్ టాస్క్ టీమ్‌లో సభ్యుడు
  • DST, న్యూఢిల్లీ.వారి మిషన్ అడ్వైజరీ కమిటీ, అడ్వాన్స్‌డ్ కాంపోజిట్స్ మిషన్‌లోసభ్యుడు
  • సీనియర్ అసోసియేట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (NIAS), బెంగళూరు.
  • విజిటింగ్ సైంటిస్ట్, అనలిటికల్ సర్వీసెస్ మెటీరియల్స్ ఇంక్., హాంప్టన్, వర్జీనియా, అమెరికా (1987)

పురస్కారాలు, సన్మానాలు

[మార్చు]
  • శ్రీ తమ్మ సాంబయ్య పతకం - ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1959
  • నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ (అమెరికా) యొక్క సీనియర్ రెసిడెంట్ రీసెర్చ్ అసోసియేట్‌షిప్
  • ఉత్తమ పేపర్‌కి ఏరోస్పేస్ గోల్డ్ మెడల్ - ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, 1988
  • ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా బిరెన్ రాయ్ ట్రస్ట్ పురస్కారం, 1993
  • ఉత్తమ ప్రాయోజిత పరిశోధన ప్రాజెక్టుకు గాను ARDB సిల్వర్ జూబ్లీ పురస్కారం, 1996.
  • ఐఐఎస్‌సి అలుమ్ని పురస్కారం: ఇంజినీరింగ్ రీసెర్చ్‌లో ఉత్కృష్టతకు గాను ప్రొఫెసర్ రుస్తోమ్ చోక్సీ పురస్కారం
  • DRDO అకడమిక్ ఎక్సలెన్స్ పురస్కారం 2002
  • భారత ప్రభుత్వం, 2005 సంవత్సరానికి సైన్స్ & ఇంజనీరింగ్‌కు పద్మశ్రీ పురస్కారం
  • ఏరో సొసైటీ అవార్డ్స్: ఎక్సలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ బిరెన్ రాయ్ ట్రస్ట్ పురస్కారం
  • ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్: ఉత్తమ పేపర్‌కి గోల్డ్ మెడల్
  • 2004లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా 37వ ఇంజనీర్స్ డే సందర్భంగా విశిష్ట ఇంజనీర్ గుర్తింపు పొందాడు
  • ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటేషనల్ & ఎక్స్‌పెరిమెంటల్ ఇంజినీరింగ్ & సైన్సెస్ (ICCES), చాంగ్వాన్, కొరియా, 2014, డ్యామేజ్ టాలరెన్స్ మెథడాలజీలకు, భారతదేశంలో అనేక తరాల విద్యార్థులకు బోధనలో చేసిన కృషికీ గాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ మెడల్‌
  • ఏరోస్పేస్‌ విద్య, పరిశోధన రంగంలో అత్యుత్తమ సేవలకు గాను, 2012 లో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ & ఇండస్ట్రీస్ (SIATI) ద్వారా లైఫ్‌టైమ్ సర్వీస్ పురస్కారం,
  • ఆస్ట్రేలియాలో వరల్డ్ కాంగ్రెస్ ఆన్ కంప్యూటేషనల్ మెకానిక్స్ (WCCM), ఆసియా పసిఫిక్ కాంగ్రెస్ ఆన్ కంప్యూటేషనల్ మెకానిక్స్ (APCOM) నుండి 2010–11 లో సీనియర్ సైంటిస్ట్ పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.