Jump to content

బి.ఎల్.ఎస్.ప్రకాశరావు

వికీపీడియా నుండి
(భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు నుండి దారిమార్పు చెందింది)
బి.ఎల్.ఎస్.ప్రకాశరావు
బి.ఎల్.ఎస్.ప్రకాశరావు
జననంఅక్టోబరు 6, 1942
వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్ల
జాతీయతభారతీయుడు
రంగములుగణిత శాస్త్రము
గణాంక శాస్త్రము
చదువుకున్న సంస్థలుమిచిగాన్ స్టేట్ విశ్వవిద్యాలయం
ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)హెర్మన్ రూబిన్
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (1982)
అవుట్‌స్టాండింగ్ అల్యూమిని అవార్డు,మిచిగాన్ స్టేట్ విస్వవిద్యాలయం (1996)
పి.వి.సుఖాత్మె ప్రైజ్(2008)

బి.ఎల్.ఎస్.ప్రకాశరావు ఆంధ్ర ప్రదేశ్కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. ఈయన పూర్తి పేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు.

జీవిత విశేషాలు

[మార్చు]

ప్రకాశరావు వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్లలో అక్టోబరు 6, 1942 న జన్మించాడు.[1].తండ్రిపేరు భాగవతుల రామమూర్తి. ఆయన విశాఖపట్టణం లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్లో బి.ఎ.ఆనర్సు (గణితం) 1957-1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి అమెరికా లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఈస్ట్ లాన్సింగ్) లో 1966 లో పి.హెచ్ డి. చేశాడు.

వృత్తి, పదవులు

[మార్చు]

బోధన, పరిశోధనలను వృత్తిగా తీసికొని, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా), పర్డ్యూ విశ్వవిద్యాలయం, విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్), అయోవా విశ్వవిద్యాలయం (అయోవా సిటీ) లలోనూ, కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలోను వివిధ బోధన పదవులను అధిష్టించి, సంభావ్యతావాదము, గణాంకశాస్త్రములలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, తగిన గుర్తింపును పొందాడు. అతడి పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ప్రకాశరావును గౌరవించింది. భారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కొత్తఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తాలలో ఆచార్య పదవిని అధిష్టించడమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ కలకత్తాకు డైరక్టరుగా ఉండి, దానికి దిశానిర్దేశంచేశాడు.

బిరుదులూ, పురస్కారాలు

[మార్చు]

1982లో ప్రతిష్ఠాత్మకమైన భట్నాగర్ పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందాడు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపబడ్డాడు.[2] సుమారు రెండు వందల పరిశోధన పత్రాలను, ఎన్నో శాస్త్రీయగ్రంథాలను ప్రకటించాడు. విశిష్ట ఆచార్యుడుగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అతడిని గౌరవించింది. హైదరాబాదు విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మీద జవహర్ లాల్ నెహ్రూ పీఠాన్ని అలంకరించాడు.

మూలాలు

[మార్చు]
  1. Bose, Arup. "Econometric Theory". Econometric Theory / Volume 27 / Issue 02 / April 2011, pp 373–411. Cambridge University Press. Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-27.
  2. "HAND BOOK OF SANTISWARUP BHATNAGAR AWARD WINNERS, Prakasa Rao, Bhagavatula Lakshmi Surya - Mathematical Statistics" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2016-05-13.

బయటి లింకులు

[మార్చు]