భాద్రపద శుద్ధ దశమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

బాధ్రపద శుద్ధ దశమి అనగా భాద్రపదమాసములో శుక్ల పక్షము నందు దశమి తిథి కలిగిన రోజు. చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని భాద్రపద మాసం అని పిలుస్తారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం దేవ, ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.[1]

జననాలు[మార్చు]

2007

మరణాలు[మార్చు]

2007

పండుగలు, జాతీయ దినాలు[మార్చు]

  • సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి పవిత్రోత్సవం : దశమి నుండి చతుర్దశి వరకు. స్వామివారి నిత్యనైమిత్తికాలలో తెలిసిగాని, తెలియకగాని జరిగిన దోషనివారణ కోసం జరిపే ఉత్సవం.
  • ఈరోజు దశావతార వ్రతం ఆచరించడం, దేవ-ఋషి-పితరులకు తర్పణాలు సమర్పించడం ముఖ్యమైన విధులు.[2]

విశేషాలు[మార్చు]

ఈ దశమిని ఆషాఢ దశమి అంటారు. ఆరోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఆషాఢ అనగా వాస్తవంగా "ఆశాఢ" అని పేరు. అనగా ఆ పదం ఆశ - ఆఢ అనే పదాల సముదాయం. అనగా ఆశలతో నిండినది అని అర్థం. పూర్వాషాఢ అనగా మొదటి ఆశలు. ఉత్తరాషాఢ అనగా తరువాతి ఆశలు అని అర్థం. బ్రతుకుని సాగించే ఆశ పూర్వాషాఢ అయితే, ఉత్తమ లోక ప్రాప్తి ఆశ ఉత్తరాషాఢ అవుతుంది. ఆనాడు వచ్చే దశమిని దశ హర అంటారు. అనగా పది పాపములను హరించేది అని అర్థం. శరీరంతో మూడు, మనసుతో నాలుగు, వాక్కుతో మూడు మొత్తం పది పాపాలు చేస్తాము. భాద్రపద శుద్ధ దశమి నాడు అదితిని, ఇంద్రుడిని, కశ్యప ప్రజాపతిని, సూర్య భగవానుని, అగ్నిహోత్రుని, వరుణుని, వాయువును, యముడు, కుబేరుడు, ఈశానుడు ఈ పదిమందిని ఆరాధించి వారి మధ్యన శ్రీమన్నారాయణున్ని ప్రతిష్టించి భక్తితో ఆరాధించి తమ పది పాపాలు తొలగించమని ప్రార్థించి లక్ష్మినారాయణ ప్రతిమను గురువుగారికి కానీ బ్రాహ్మణుడికి కానీ దానం చేసి బంధు మిత్రులతో కలిసి భోజనం చేయాలి. ఇది దశ హర వ్రతం.[3]

మూలాలు[మార్చు]

  1. Charya, M. N. (2020-08-21). "భాద్రపద మాసంలో ధన సమృద్ధి ఆరోగ్యం ప్రాప్తించాలంటే ఏం చేయాలి..?". telugu.oneindia.com. Retrieved 2021-01-10.
  2. భాద్రపద శుద్ధ దశమి - దశావతార వ్రతం, ధర్మసింధు, శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, 2009 పేజీ. 188.
  3. "ధర్మం మర్మం - భాద్రపద మాసం - మహాలయ పక్షం (ఆడియోతో.. - Prabha News". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-01-10.