Jump to content

భారతదేశంలో అటవికజాతులు

వికీపీడియా నుండి

భారత దేశంలో అనేక తెగల, జాతుల అటవిక తెగల వారు నివసిస్తున్నారు. వారు నాగరీక ప్రపంచానికి దూరంగా.... సభ్య సమాజానికి భిన్నంగా, అడవులలో నివసిస్తున్నారు. వారికి భాష వుంటుండి కాని దానికి లిపి వుండదు. వారు అడవిలో జంతువులతో పాటే నివసిస్తుంటారు.... కాని జంతువుల వలె క్రూరులు కారు. అమాయకులు, ఆత్మీయులు... వారి లోకం వేరు, జీవన విధానము వేరు. నవీన నాగరీక జీవన స్రవంతిలో వారు కలవరు.... వారి లోకం వేరు.... వారి పోకడ వేరు.... నాగరీకుల జోలికి వారు రావడం లేదు...వారి మానాన వారు నాగరికతకు దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. .నాగరీకుల జోలికి వారు రాక పోయినా నాగరీకులు మాత్రము వారి జోలికి వెళ్ళి వారిని అభివృద్ధి చేస్తామంటూ అనేక పథకాల పేరు చెప్పి వారికి కేటాయించిన ధనాన్ని కొల్ల గొట్టు తున్నారు. ఈ విషయం వారికి తెలియదు. నాగ రీకులు అంతటితో ఆగకుండా వారి స్వయం కష్టాన్ని కూడా దోచుకుంటున్నారు... వారు సేకరించే అటవిక వుత్పత్తులు అతి సరసంగా కొని అధిక మొత్తంలో అమ్మి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. ఆ వచ్చిన ఆదాయానికే ఆ అమాయకులు ఉప్పొంగి పోతున్నారు. అలాంటి అనేక జాతులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రదేశాల వారిగా ఆయా జాతులు, తెగల పేర్లు తెలుసుకోవడమే ఈ ప్రయత్నం.

ఆటవిక జాతి/తెగ పేరు:............... వారు నివసించే ప్రాంతం/రాష్ట్రం

  1. అబోర్స్...........................అస్సాం, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలలో
  2. అవతామీలు.....................అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలో
  3. బడగాలు.........................నీలగిరి. తమిళనాడు రాష్ట్రంలో ప్రాంతం
  4. బైగాలు.......................... మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో అటవిక ప్రాంతాలలో
  5. భోటియాలు..................... ఉత్తర ప్రదేస్ లోని గర్వాల్, కుమావన్ ప్రాంతాలు.
  6. బిర్ హారులు.................... హజరీ భాగ్, బీహార్ రాష్ట్రంలో కొంత భాగంలో
  7. చెంచులు........................ ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రెండు రాష్ట్రాలలో కొండ ప్రాంతాలలో
  8. చూటియాలు.....................అస్సాం రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో మాత్రమే.
  9. గడ్డీలు............................. హిమాచల్ ప్రదేశ్ అటవీ ప్రాంతాలలో
  10. గల్లంగులు......................... ఈశాన్య హిమాలయ ప్రాంతం
  11. గారోలు............................. మేఘాలయ రాష్ట్రంలో కొంట/అటవీ ప్రాంతంలో
  12. గోండులు........................... మధ్య ప్రదేశ్, బీహారు, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్
  13. జరవాలు........................... అండమాన్ దీవులలో మాత్రమే
  14. ఖాసులు........................... ఉత్తర ప్రదేశ్ లోని జంసార్ . బాబర్ ప్రాంతము
  15. ఖాశీలు............................. అస్సాం, మేఘాలయ రెండు రాష్ట్రాలలో కొండ ప్రాంతాలలో
  16. ఖోండులు......................... ఒడిషా రాష్ట్రం లోని కొండ ప్రాంతాలలో
  17. కోలులు............................ మధ్య ప్రదేశ్ రాష్ట్రం అటవీ ప్రాంతాలలో
  18. కోలములు......................... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే
  19. కోటాలు............................. నీలగిరి ప్రాంతం, తమిళ నాడు రాష్ట్రం.
  20. కుకీలు.............................. మణిపూర్ ప్రాంతంలో
  21. లేప్పాలు........................... సిక్కిం రాష్ట్రములో కొండ ప్రాంతములో
  22. లుషాయీలు....................... త్రిపురలో మాత్రమే
  23. మినాలు............................ రాజస్థాన్ రాష్ట్రములో మాత్రమే
  24. మురియాలు....................... మధ్య ప్రదేశ్ లోమి బస్థర్ ప్రాంతంలో
  25. ముకిరీలు........................... అస్సాం రాష్ట్రంలో
  26. మెంపాలు........................... అరుణాచల్ రాష్ట్రములో
  27. నాగాలు.............................. నాగాలాండ్, అస్సాం రాష్ట్రంలో. వీరిలో ఉప తెగలు: అంగామీలు, సెమీలు, ఆవోలు, తంఘుకూలు, లాయోరాలు.
  28. ఒయారాన్లు లేదా కురుకులు...... బీహారు, ఒడిషా రాష్ట్రాలలో
  29. అంజులు.............................. అండమాన్ నికోబార్ దీవులు....
  30. సంతాలులు.......................... బెంగాల్ లోని బీర్బం ప్రాంతం, బీహార్ లోని హాజరీ బాగ్ ప్రాంతం, రాంచీ లోని పలమావు ప్రాంతం.#
  31. సెంటినలీలు.......................... అండమాన్ నికోబారు దీవులలో కొన్ని ప్రాంతాలలో.
  32. షాంపెన్లు............................. అండమాన్, నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలు.
  33. తోడాలు.............................. తమిళ నాడు రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతం.
  34. ఉరలీలు............................. కేరళలో మాత్రమే
  35. వర్లీలు................................ వీరు మహారాష్ట్ర ప్రాంతంలో మాత్రమే నివసిస్తారు.