మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 (జులై 2008) ప్రకారం[1]టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడియో 21.4%, సినిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది.
2006 R2 ప్రకారం, టెలివిజన్ 54.7%, పత్రికలు 38.7%, రేడియో 19.3%, సినిమా 10.8% ఇంటర్నెట్ 1.5%గా ఉంది. అనగా టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు, సినిమా తగ్గుముఖం పట్టాయి.
పూర్తి వివరాలు.
కామ్ స్కోర్ ప్రకారం[2] ప్రకారం.
మే 2008 లో 15 సంవత్సరాలు ఆ పై వయస్సు కల వ్యక్తులు 28 మిలియన్లు అనగా 2.8 కోట్ల మంది, ఇంటినుండి, లేక ఆఫీసు నుండి ఇంటర్నెట్ వాడారు. ఇది క్రిందటి సంవత్సరంతో పోల్చితే 27 శాతం పెరుగుదల. దేశ జనాభాలో3 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.
సాధారణ ఇంటర్నెట్ వాడుకరి, నెలలో సగటున 25 రోజులు ఇంటర్నెట్ వాడారు. ఒక్కొక్క సారి సగటున 25 నిముషాలు గడిపాడు.
మాపులు, ఆటలు, వినోదం, ఆర్థిక వార్తలు, పరిశోధన సైట్లు అత్యధిక పెరుగుదల సాధించాయి.
నిర్దిష్ట వీక్షకుల ఆధారంగా భారత దేశంలో వారు వాడే వెబ్ సైటులు
మే 2008 తో మే 2007
భారత మొత్తం: వయస్సు 15+, ఇల్లు లేదా ఆఫీసు నుండి, (సైబర్ కేఫ్ వాడుకరులను లెక్కించలేదు)
'ఇండియా ఆన్ లైన్ 2008' భారత్ లో ఒక సంవత్సరంలో ఇంటర్నెట్ వినియోగం పై జక్స్ట్ కన్సల్ట్ వారి సమగ్ర పరిశోధన [3] ప్రకారం 40మిలియన్ల పట్టణ ప్రాంత, 9మిలియన్ల గ్రామీణ ప్రాంత నెట్ వినియోగదారులతో కలిపి మొత్తం 49మిలియన్ల నెట్ వినియోగదారులు ఉన్నారు.