భారతదేశపు మహిళా ఫైటరు ఫైలట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశపు సాయుధ రక్షణ దళాల్లో లింగ సమానత్వానికి ప్రతీకగా, భారతదేశ రక్షణదళ చరిత్రలో మొదటిగా ముగ్గురు మహిళా పైటర్ పైలెట్లు వైమానిక దళంలో అడుగు పెట్టారు. అవని చతుర్వేది, భావనా కాంత్, మొహానా సింగ్ లు ఆ ఖనత పొందిన ప్రథమమహిళా ఫైటరులు.2016 జూన్ 18 శనివారం, తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ శివారులోఉన్నటువంటి దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో నిర్వహించిన కంబైండ్ గ్రాడ్యుయేసన్ కార్యక్రమంలో ఈ ముగ్గురు మహిళా ఫైటరు ఫైలెట్లను అధికారికంగా వైమానిక దళంలోకి తీసుకొన్నారు[1].

భారతదేశ వైమానిక దళంలో స్త్రీల ప్రస్థానం[మార్చు]

భారతవైమానిక దళంలోకి మహిళలను తీసుకోవటం 1992 లో మొదలైనది.2016 నాటికి భారతదేశ సాయుధదళాల్లో సుమారు 3,500మంది పనిచేస్తుంటే, వైమానిక రక్షణరంగంలో ఇంచుమించు 1500 మంది వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.అయితే ఇంతవరకు మహిళలను రవాణా విమానాలు, హెలికాప్టర్లకు మాత్రమే చోదకులగా/పైలెట్ నియమించారు.25 సంవత్సరాల భారతదేశ వైమానికరక్షణదళ చరిత్రలో ఇప్పుడు మొదటి సారిగా ముగ్గురు ఆడవారికి ఫైటరు విమానచోదకులుగా అవకాశం ఇచ్చారు.2016 నాటికి ఇంకను పదాతిదళాల్లో సాయుధ సైనికులుగాను, యుద్ధట్యాంకులలో, యుద్ధనౌకలలో స్త్రీలకు ప్రవేశం లేదు.

విదేశరక్షణ రంగాల్లో మహిళలు[మార్చు]

2016, జూన్ నాటికి అమెరికా, పాకిస్థాన్, చైనా యూఏఈ, ఇజ్రాయిల్ దేశాల రక్షణ దళాలలోమాత్రమే మహిళా ఫైటరు ఫైలెట్లు ఉన్నారు.ఇప్పుడు భారతదేశం వాటి సరసన చేరినది. అమెరికా సాయుధ రక్షణ రంగంలో ఆడవారిని నియమించడం పై ఉన్న నిషేధాన్ని 2013 సంవత్సరంలో అధికారంగా ఎత్తివేసినప్పటికి, అక్కడ 1991 నుండే అమెరికా మహిళలు ఫైటర్‌జెట్ ఫైలెట్లుగా పనిచేసెవారు. ఆసియా ఖండంలో, రక్షణ రంగంలో భారతదేశం కన్న ముందు, భారతదేశపు సరిహద్దు సోదరదేశం 2002 లోనే ఫైటరు ఫైలెట్లగా మహిళలను అనుమతించింది. ఆతరువాత భారతదేశంలో దశాబ్దం కాలంతరువాత 21 మంది మహిళా ఫైలెటులు కదనరంగంలో సిద్దం అయారు. అప్ఘనిస్థాన్‌ దేశంలో 2011లోనే స్త్రీలను ఫైటరు ఫైలెట్లుగా అనుమతించారు. అరబ్ ఎమిరేట్స్ లో 2007లో అనుమతిం<చారు. యూఏఈలో మొదటీ ఫైటర్ ఫైలెట్ మేజర్‌ మరియం అల్‌మన్సొరి[2].

భారతదేశ మొట్టమొదటి మహిళా ఫైటరువిమాన ఫైలెట్లు[మార్చు]

ఆరుగురు మహిళా క్యాడెట్లు ఫైటరు ఫైలెట్లగా శిక్షణ పొందుటకు పోటీలోకి దిగగా కేవలం ముగ్గురు మాత్రమే అర్హత సాధించారు.ఆముగ్గురు, అవని చతుర్వేది, భావనాకాంత్, మొహనాసింగ్‌లు.వీరు ఏదాది పాటు కర్నాటక రాష్ట్రంలోని బీదర్లో హాక్‌ అడ్వాన్సడ్ జెట్‌ట్రైనింగ్ పొందనున్నారు.

అవని చతుర్వేది[మార్చు]

  • ఈమె స్వస్థలం: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా.
  • నేపథ్యం:అవనిచతుర్వేది ఆర్మి అధికారుల కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది.అమె తన ఆర్మీలో పనిచేయుచున్న సోదరుడినుండి ప్రేరణ పొందినది.తన కాలేజిలోని ఫ్లైయింగ్ క్లబ్ లో చేరినది>[3]
  • చదువు:అవనిచతుర్వేది బీటెక్ (కంప్యుటర్ సైన్స్) చదివినది.

భావనా కాంత్[3][మార్చు]

  • స్వస్థలం:బిహార్ రాష్ట్రంలోని దర్భంగా
  • నేపథ్యం:తండ్రి ఐఓసీ ఆఫిసర్
  • విద్యార్హత:బీఈ (మెడికల్ ఎలక్ట్రాన్స్)

మోహనాసింగ్[మార్చు]

  • స్వస్థలం:రాజస్థాన్ రాష్ట్రంలోని జూన్‌జును
  • కుటుంబ చరిత్ర:తండ్రి ఐఏఎఫ్ లో అధికారి.తాతగారు ఫ్లైట్ గన్నర్, తండ్రి వారెంట్ ఆఫిసర్[3]
  • విద్యార్హత:బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేసన్)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]